కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తాడు..

news02 Sept. 11, 2018, 9:16 p.m. political

uttam

హైదరాబాద్- కేసీఆర్ కు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజ్ భవన్ లో అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసిన సందర్బంగా ఆయన ఈ విధంగా స్పందించారు. ఉత్తమ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున జానా రెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్, సీపీఐ నుంచి చాడా వెంకట్ రెడ్డి, కోదండరాం తదితరులు గవర్నర్ తో సమావేశం అయ్యారు. తెలంగాణలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని అఖిలపక్ష నేతలు నరసింహన్ ను కోరారు.

uttam

ఇక కేసీఆర్ ఆపధ్దర్మ సీఎం గా కొనసాగితే పరిపాలన సక్రమంగా జరగదని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా తప్పించి.. రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ను రహస్యంగా ఉంచాలని.. కాని అందుకు విరుద్దంగా కేసీఆర్ ఎలక్షన్ షెడ్యూల్ ను ఎలా ప్రకటిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులను కలరాసే విధంగా.. మోడీ, కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజీవ్ శర్మ బ్రోకర్ లా పనిచేస్తున్నాడన్న ఉత్తమ్... రాజీవ్ శర్మ ఎన్నికల కమిషన్ ను టీఆర్ ఎస్ పార్టీ తరపున ఎలా కలుస్తారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఓటర్ లిస్టులో ఓటర్లను తొలగించడంతో పాటు.. ఎన్నికల కమిషన్ ను కేసీఆర్ మానిప్లెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

uttam

ఇక కెసిఆర్ ఇష్టారాజ్యంగా పరిపాలించి, అర్దాంతరంగా పరిపాలన నుంచి తప్పుకున్నారని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించాారు. కెసిఆర్ ముందస్తు ఎన్నికల కోసం కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలుకాలేదని ఎల్ రమణ మండిపడ్డారు. ఇక అఖిలపక్ష పార్టీలన్నీ రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరబోతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో టిఆర్ ఎస్ పార్టీ తప్ప తప్ప మిగిలిన అన్ని పార్టీలన్ని కలిసి కేసీఆర్ ను ఓడిస్తామని రమణ అన్నారు.

uttam

ఇక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలన్న కోదండరాం.. హడావుడిగా ఎన్నికలు నిర్వహించకుండా గళ్లంతయిన ఓట్లను తిరిగి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని, దానికి రికమండషన్ పంపమని గవర్నర్ ను కోరామని కోదండరాం తెలిపారు. టీఆర్ ఎస్ కు దమ్ముంటే.. పిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. కెసిఆర్ నేనె రాజు నేనె మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పిన ఆయన..  అనువనువనా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

tags: all party leaders meet governor, all party leaders compliant to governor against kcr, all party leaders compliant against kcr, all party leaders demand romove kcr, uttam meet governor, uttam demand remove kcr, uttam compliant against kcr

Related Post