కేసీఆర్ కు.. ఉత్త‌మ్ లేఖాస్త్రం.

news02 Dec. 25, 2018, 11:24 p.m. political

uttham_on_bc_regervestions_in_panchath elctions, open letter, kcr

హైద‌రాబాద్ - కేసీఆర్ ప్ర‌భుత్వంపై పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ లేఖాస్త్రాన్ని సంధించారు. పంచాయితీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ ల విష‌యంలో .. కేసీఆర్ ప్ర‌భుత్వం అప్ర‌జాస్వామికంగ వ్య‌వ‌హరించిందంటూ లేఖ‌లో మండిప‌డ్డారు ఉత్త‌మ్. రిజ‌ర్వేష‌న్ ల‌పై  డిసెంబ‌ర్  15 న  ప్ర‌భుత్వం  ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం హ‌డావిడిగా  తీసుకువ‌చ్చిన ఆర్డినెన్స్ తో.పంచాయితీల్లో  బీసీ కోటాకు కోత ప‌డింది. ఈ ఆర్డినెన్స్ ను ఆయుదంగా చేసుకుని ప్ర‌భుత్వం ఈ ఎన్నిక‌ల్లో బీసీల‌కు 22.79 శాతం.,ఎస్సిల‌కు-20.53, ఎస్టీ-6.68 శాతం రిజ‌ర్వేష‌న్ల ను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఇలా ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రించిన  తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతూ.. ఉత్త‌మ్ త‌న లేఖ‌లో  ప్ర‌భుత్వానికి ప్ర‌శ్నలు సందించారు.

uttham__on_bc_regervestions, panchath elections, cm kcr

గ‌త పంచాయితి ఎన్నిక‌ల్లో బీసీల‌కు 34 శాతం. ఎస్సి, ఎస్టీల‌కు రాజ్యాంగ బ‌ద్దంగా వారి జ‌నాభా ప్రాతిపాదిక‌న‌ రిజ‌ర్వేష‌న్ లు అమ‌ల‌య్యాయి. తాజాగా ప్ర‌భుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ తో బీసీల‌కు అన్యాయం జ‌రిగింది. గ‌తం కంటే బీసీకు 11 శాతం రిజ‌ర్వేష‌న్ లు త‌గ్గాయి. దీని కార‌ణంగా.. సుమారు బీసీలు మూడు వేల మంది స‌ర్పంచ్ లుగా అవ‌క‌శాన్నికోల్పోతున్నారు. 

bc regervestions , panchayathi electoins, kcr, uttham kumar reddy

ఇలా ప్ర‌భుత్వం కావాల‌నే ప్ర‌భుత్వం  ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చి.. బీసీల‌కు అన్యాయం చేసింద‌ని ఉత్త‌మ్ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ పూర్తిగా  అప్రజాస్వామికం అని ఉత్త‌మ్ ఆరోపించారు.  ఇంత హ‌డావిడిగా ప్ర‌భుత్వం  ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవ‌స‌రం  ఏమొచ్చింద‌న్న ఉత్త‌మ్.,   గ‌తంలో హైకోర్ట్ చెప్పిన విధంగా ప్ర‌భుత్వం ఎందుకు బీసీ కుల గ‌ణ‌న ఎందుకు జ‌ర‌ప‌లేద‌ని ప్ర‌శ్నించారు. హైకోర్ట్ ఆదేశాల‌ను తుంగ‌లొ తొక్కి  ప్ర‌భుత్వం బీసీ కోటాకు కోత పెట్టింద‌న్న ఉత్త‌మ్.,  త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ ను వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు..  త‌క్ష‌ణ‌మే  బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టి.. జ‌నాభా ప్రాతిపాదిక‌గా పంచాయితీల్లో వారికి  రిజ‌ర్వేష‌న్ లను అమ‌లు చేయాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు ఉత్త‌మ్.

uttham_kumar_reddy_on_bc_regervestions_panchath_elections

అయితే యాబై శాతానికి రిజ‌ర్వేష‌న్ లు మించ‌కూడ‌ద‌న్న  హైకోర్ట్ తీర్పు కార‌ణంగానే..తాము  ఆర్డినెన్స్ ను తీసుకువ‌చ్చామ‌ని అంటుంది స‌ర్కార్. ఈ తాజా రిజ‌ర్వేష‌న్ ల‌తో  కోటాలో కోత ప‌డ‌టంతో.. ఇప్ప‌డికే బీసీ సంఘాలు ఆంధోళ‌న బాట ప‌ట్టాయి. ఒక వైపు ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం.. మ‌రోవైపు బీసీ సంఘాల ఆంధోళ‌న‌ల నేప‌థ్యంలో పంచాయితీ ఎన్నిక‌లు ప్ర‌బుత్వం చెబుతున్న‌విధంగా జ‌రుగుతాయా.. లేదా..?  అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

uttham_open_letter_to_kcr,bc regervestions

tags: uttham kumar reddy, tpcc president, bc regervestioons, panchayathi elections, cm kcr, telangana, high court, gandhibhavan, ts governament

Related Post