కెప్టెన్ జోరుకు ప్ర‌త్య‌ర్థుల బేజారు

news02 July 6, 2018, 10:22 a.m. political

uttam slide

హైద‌రాబాద్: సోష‌ల్ మీడియాలో పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దూసుకుపోతున్నారు. యువ‌త నుండి వృద్దుల వ‌ర‌కు.. వారి వారి జీవ‌న్ శైలిలో భాగ‌మైపోయిన‌ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుంటున్న ఉత్త‌మ్. దాన్ని పూర్తి స్తాయిలో వాడుకుంటున్నారు. తాను చేస్తున్న‌ది.. తాను చేయాల‌నుకుంటున్న‌ది.. తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది.. సూటిగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు పీసీసీ కెప్టెన్.

uttam kumar reddy

స్మార్ట్ ఫోన్ విప్ల‌వంతో.. సోష‌ల్ మీడియా హ‌ద్దులు వేగంగా మారిపోయాయి. క్ష‌ణాల్లో రాష్టము..దేశ‌మే కాదు .. ఏకంగా ఖండాంత‌రాలకు సోష‌ల్ మీడియా ద్వారా చేరుకుంటున్నారు. దీనితో దాన్ని ప్రాముఖ్య‌త బాగా పెరిగి పోయింది. అంతేకాదు.. గ‌త సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో మోడి ప్ర‌ధాని కావ‌డంలో సోష‌ల్ మీడియాది కీల‌క పాత్ర‌ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దీన్నిగుర్తించిన రాహుల్.. సోష‌ల్ మీడియాను బాగా వాడుకోవాల‌ని ఇప్ప‌డికే అన్ని పీసీసీల‌కు ఆదేశాలు జారీ చేశార‌ట‌. దీనిలో భాగంగా పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ సోష‌ల్ మీడియాపై ప్ర‌త్యేక ఫ్యూహంతో ముందుకెళు తున్నారు.

uttam

రాష్ట్ర వ్యాప్తంగా మండ‌ల స్థాయి నుండి సోష‌ల్ మీడియా కో-ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు ఉత్త‌మ్. వారు ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల స‌మాచారాన్ని త‌మ ఫ‌రిదిలో ఉన్న క్యాడ‌ర్‌కు చేర‌వేస్తు.. మండ‌ల క‌మిటీలు చేసిన కార్య‌క్ర‌మాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేసే భాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించారు. ఇలా మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా, రాష్ట్ర అన్ని చోట్ల సోష‌ల్ మీడియా కో-ఆర్డినేట‌ర్స్‌ను నియ‌మించారు. వీరంద‌రు రాష్ట్ర సోష‌ల్ మీడియా కో-ఆర్డీనేట‌ర్‌గా ఉన్న దీప‌క్ జాన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌నిచేస్తున్నాంటారు.

uttam

ఇక రాష్ట్ర పార్టీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు టీపీసీసీ ఫేస్‌బుక్‌ పేజ్ ద్వారా.. క్యాడ‌ర్ టూ లీడ‌ర్ కు చేర‌వేస్తున్నారు. ఇక పార్టీ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన స‌మాచారాన్నిబ‌ల్క్ ఎస్ఎంఎస్ ద్వారా క్యాడ‌ర్‌కు చేర‌వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్త‌మ్ వ్వ‌క్తిగ‌తంగా సోష‌ల్ మీడియాలో దూకుడును క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌డికే ఉత్త‌మ్ ఫ‌ర్ యూ.. పేరుతో యూటూబ్, ఫేస్‌బుక్‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాలు.. తాను చేసిన‌, చేస్తున్న ప్రొగ్రామ్స్‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని య్యూటూబ్, ఫేస్‌బుక్ ద్వారా చేరేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ఉత్త‌మ్.

uttam and kcr

దీంతో పాటు వాట్సాప్, ట్విట్ట‌ర్‌ల‌లో యాక్టివ్ గా ఉంటున్నారు ఉత్త‌మ్. త‌న‌కు సంబంధించిన స‌మాచారాన్నివీటి ద్వారా క్ష‌ణాల్లో క్యాడ‌ర్‌కు చేరేలా వ్వ‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్నారు పీసీసీ ఛీఫ్. ముఖ్యంగా చెప్పాలంటే...ఈమ‌ధ్య ట్విట్ట‌ర్లో ఉత్త‌మ్ దూకుడుతో అదికార పార్టీని డిఫెన్స్‌లోకి నెట్ట‌డం అంద‌రిని ఆక‌ర్షించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ రెఢీ నా అంటు.. సిఎం కేసీఆర్ అలా అన్నారో లేదో.. క్ష‌ణాల్లో ట్విట్టర్లో కౌంట‌ర్ ఇచ్చారు ఉత్త‌మ్. దైర్యం ఉంటే ప్ర‌భుత్వాన్నిర‌ద్దు చేయ్ ..కాంగ్రెస్ ఎన్నిక‌ల‌కు రెఢీ అంటు ట్విట్ చేశారు ఉత్త‌మ్. సోనియా..అమ్మ‌నా..బొమ్మ‌నా అంటు కేటీఆర్ బ‌హిరంగ స‌భ‌లో వ్యాఖ్య‌లు చేయ‌గానే అంతే స్పీడ్‌గా కేటీఆర్‌కు దిమ్మ‌తిరిగేలా ట్విట్ట‌ర్లో కౌంట‌ర్ ఇవ్వ‌డం ఉత్త‌మ్ దూకుడుకు అద్దం ప‌డుతుంది.

uttam cadre

అంతేకాకుండా ఫేస్‌బుక్ లైవ్‌ల‌తో క్యాడ‌ర్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు ఉత్త‌మ్. వారంలో క‌నీసం రెండు సార్లు.. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతూ...వారికి  దిశా నిర్ధేశం చేస్తున్నారు ఉత్త‌మ్. దీంతో పాటు టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటూ.. CHARMS (కాంగ్రెస్ హ్యూమ‌న్ అండ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్ట‌మ్) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ఏక‌కాలంలో టెలీకాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ ... వారి అభిప్రాయాల‌ను తీసుకుంటూ వారిని క‌ర్యోణ్ముకుల‌ను చేస్తున్నారు ఉత్త‌మ్. 

sonia,rahul appreciate to the uttam kumar reddy

ఫేస్‌బుక్‌, య్యూటుబ్, ట్విట్ట‌ర్, వాట్సాప్, టెలీకాన్ఫ‌రెన్స్ ఇలా అన్నివేదిక‌ల ద్వారా ఉత్త‌మ్ తాను చెప్ప ద‌లుచుకున్న‌ది చెబుతున్నారు. ముఖ్యంగా అదిష్టానం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా  తీసుకున్న శ‌క్తి యాప్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోతున్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇలా ఒక‌వైపు త‌న రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థుల‌ను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూనే.. ఇంకో వైపు పార్టీ కార్యక్ర‌మాలు, హైక‌మాండ్ ఆదేశాలు. తాను చెప్పాలనుకుంటున్న అంశాల‌ని క్ష‌ణాల్లో సోషల్ మీడియా వేదికగా క్యాడ‌ర్‌కు చేర‌వేస్తున్నారు ఉత్త‌మ్. మొత్తానికి సోషల్ మీడియాలో ఉత్తమ్ స్పీడ్‌ను చూసి ఢిల్లీ పెద్దలు సైతం శెభాష్ కెప్టెన్ .. అంటున్నారట.

tags: uttam halchal in social media,uttam kumar reddy,uttam kumar reddy wife,uttam kumar reddy son,uttam kumar reddy songs,uttam kumar reddy bus yatra,uttam kumar reddy photos,uttam kumar reddy age,uttam kumar reddy speech,uttam kumar reddy mp3 songs,uttam kumar reddy wife photos uttam kumar reddy family,uttam kumar reddy audio songs,uttam kumar reddy anumula,uttam kumar reddy address,uttam kumar reddy affidavit,uttam kumar reddy assets,uttam kumar reddy air force,uttam kumar reddy army,uttam kumar reddy minister address,uttam kumar reddy house address,uttam kumar reddy biography,uttam kumar reddy biodata,uttam kumar reddy birthday,uttam kumar reddy brothers,uttam kumar reddy business,uttam kumar reddy beard,uttam kumar reddy congress,uttam kumar reddy childrens,uttam kumar reddy congress party,,uttam kumar reddy constituency,uttam kumar reddy contact number,uttam kumar reddy caste,uttam kumar reddy contact details,uttam kumar reddy cat,telangana congress,telangana congress leaders,telangana

Related Post