క్యాడర్ లో కొత్త ఉత్సాహం

news02 Feb. 7, 2019, 8:07 a.m. political

priyanka

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మనీ లాండరింగ్ కేసులో తన భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద కారులో దిగబెట్టాక, ప్రియాంక నేరుగా అక్కడ్నించి పార్టీ కార్యాలయానికి విచ్చేసింది. పార్టీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు పార్టీ నేతలు, కార్తకర్తలతో మాట్లాడారు. ఇక ఈడీ కార్యాలయం వద్ద తన భర్త రాబర్ట్ వాద్రాను దిగబెట్టిన ప్రియాంక ఈడీ కేసు కేవలం రాజకీయ వేధింపు మాత్రమేనని మీడియాతో వ్యాఖ్యానించారు. తాను తన భర్త వెన్నంటే ఉంటానని చెప్పిన ప్రియాంక.. ఈ వేధింపుల కేసుపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

tags: priyanka, priyanka gandhi, priyanka take charge, priyanka gandhhi take charge, priyanka took charge, priyanka gandhi took charge, priyanka gandhi took party charge

Related Post