కేసీఆర్ కు ప్రజలే బుద్ది చెబుతారు..

news02 Oct. 4, 2018, 8:45 p.m. political

congress

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నిరల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశిస్సులు తీసుకున్నారు హస్తం పార్టీ నేతలు. తెలంగాణ కు పట్టిన కేసీఆర్ శని వదిలిపోయి.. మళ్లీ మంచి రోజలు రావాలని ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు జోగులాంబ అమ్మావారిని కోరుకున్నారు. పూజా కార్యక్రమంలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు, జానా రెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలి, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన పీసిసి చీఫ్ ఉత్తమ్.. జోగులాంబ అమ్మావరి ఆశిస్సులతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. అమ్మావారి ఆశిస్సులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయన్న ఆయన.. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 

uttam

కేసీఆర్  ఆంధ్రా పూర్వికులు కాబట్టే ఆయన తెలంగాణ బాష తెలియదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. దగా మోసం చేసిన వాడిని తెలంగాణలో బట్టేబాజ్ అంటారన్న ఉత్తమ్.. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన బట్టేబాజ్ అని ఫైర్ అయ్యారు. ముందు కేసీఆర్ తెలంగాణ బాష నేర్చుకోవాలని సూచించారు. గిరిజనులను, దళితులను, అన్ని వర్గాల తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు.. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఇక కేసీఆర్ రైతులను, విధ్యార్ధులను, నిధ్యోగులను మోసం చేశారని జానా రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఎవరు మాట్లాడినా వారిని అమిచివేస్తున్నాడని ఫైర్ అయ్యారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడుతున్న కేసీఆర్.. గతంలో టీఆర్ ఎస్-టీడీపీ పొత్తు గురించి మరిచారా అని జానా రెడ్డి ప్రశ్నించారు. 

uttam

ఇక కేసీఆర్ అబద్దపు కూతలు కూస్తున్నారన్న జానా రెడ్డి.. తాను టీఆర్ ఎస్ 24గంటల కరెంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారని జానా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అవమానాలు పడ్డామన్న ఆమె.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. ఐతే తెంలగాణను సాధించుకుని మనం దొరల చేతిలో మోసపోతున్నామని విజయశాంతి ఆవేధన వ్యక్తం చేశారు. 

uttam

దొరా ఎందుకు మమ్మల్సి దోచుకుంటున్నావని ప్రశ్నించిన విజయశాంతి.. తన సినిమా ఒసేయ్ రాములమ్మ లో తాను ఎన్ని కష్టాలు పడ్డానో.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అన్ని కష్టాలు పడుతున్నారని చెప్పారు. తనను దేవుడిచ్చిన చెల్లెలని చెప్పిన కేసీఆర్.. ఎెందుకు తనను కారణం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అడిగారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వానివి సంక్షేమ పధకాలా.. లేక సంపాదన పధకాలా అని విజయశాంతి ఎద్దేవా చేశారు.ప్రజలు మాయమాటలు నమ్మి కేసీఆర్ దొరకు అధికారం ఇచ్చారన్న విజయశాంతి.. ఇకపై దొరల పరిపాలన మనకు వద్దని.. ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 
 

tags: uttam, uttam fire on trs, uttam fire on kcr, congress election campaigning in gadwal, uttam election campaigning in alampur, uttam meeting in gadwal, uttam meeting in alampur, congress rally in alampur

Related Post