మూటా ముల్లే స‌ర్దుకో .. రాజ‌కీయ స‌న్యాసం త‌ప్ప‌దు ..!

news02 July 8, 2018, 6:43 p.m. political

dk aruna

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ : మ‌ంత్రి కేటీఆర్ పాల‌మూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ పై చేసిన విమ‌ర్వ‌ల‌పై ఆ జిల్లా మాజీ మంత్రి ప్ర‌స్తుత గ‌ద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు . అయ్య .. కొడుకు .. అల్లుడు  ఎప్పుడూ కాంగ్రెస్ పై చేసే విమ‌ర్శ‌లు పాడిందే పాట‌రా .. పాసుపళ్ళ దాస‌ర అన్న‌ట్లుంద‌ని విరుచుకుప‌డ్డారు . పాలమూరు జిల్లాకు నీళ్లిచింది .. జిల్లాలో వలసలను ఆపింది .. ప్రాణం పోసింది  కాంగ్రెస్ పార్టీన‌న్న విష‌యం నీకు తెలియ‌కుంటే .. నీ అయ్య‌ను అడుగు అంటూ ఫైర్ అయ్యారు . జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించింది కాంగ్రెస్సే అన్న విష‌యం కేటీఆర్ తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు . 

dk aruna

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేన‌న్న డీకే .. ఖర్మకాలి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనన్నారు . పాలమూరు ప్రాజెక్టులకు నిధులివ్వకుండా.. కాళేశ్వరం కు మళ్ళిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు . గ‌డ‌చిన నాలుగేళ్లు జిల్లా ప్ర‌జ‌ల‌ను మొసంచేసి ... ఇపుడు కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ విమ‌ర్శించారు . టిఆర్ఎస్ డ్రామాలు ఇక  సాగవ‌న్న ఆమె .. కేటీఆర్ కు రాజకీయ సన్యాసం తప్పది హెచ్చ‌రించారు . కేటీఆర్  ముఠా ముల్లె సర్దుకో అమెరికా వెళ్ళేందుకు అంటూ ఎద్దెవా చేశారు . కరువు వలసల బారి నుంచి పాలమూరును ఆదుకున్న‌ది కాంగ్రెస్ పార్టీనేన‌న్న విష‌యం జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు డీకే .

dk aruna

హంద్రీనీవా కు హారతి పట్టింది అంటూ నాపై విమ‌ర్శ‌లు చేయ‌టానికి కేటీఆర్ కు సిగ్గుందా అని ఫైర్ అయ్యిన అరుణ .. అప్పట్లో మీ అయ్యా మీ బావ ప్రభుత్వంలో భాగస్వాములన్న విష‌యం మ‌ర‌చిపోయావా అని చుర‌క‌లంటించారు . పాలమూరు ప్రజల గురించి మాట్లాడే నేతిక అర్హత టిఆర్ఎస్ కు లేద‌న్నారు డీకే . ప్రాజెక్టుల రీ డిసైన్ ల పేరుతో అంచనాలు పెంచి .. ధ‌నార్జ‌న చేస్తున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు . రైతులకు అన్యాయం చేస్తుంటే ... రైతులు కోర్టులకు పోతే తప్పేంట‌ని అరుణ ప్ర‌శ్నించారు . మీ అయ్య కన్నా ఎక్కువ తిడితే మంచి లీడర్ అయితాన‌ని అనుకుంటున్నావా అంటూ కేటీఆర్ పై మండిప‌డిన డీకే .. నోరు దగ్గర పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు .

dk aruna

ఉమ్మ‌డి పాలమూరులో జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అరుణ .. మిషన్ భగీరథ ప‌నుల‌ను ఆల‌స్యం చేస్తూ దోపిడికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు . ఇక కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్  కి పాల్పడుతుందని ఆరోపించిన ఆమె .. ప్రతిప‌క్ష పార్టీ నేత‌ల ఫోన్ ల‌న్నీ ట్యాపింగ్ అవుతున్నాయ‌న్నారు . ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దిగజారుడు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్న డీకే .. ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ప్రజల హక్కును హరించడమేన‌న్నారు . ప్ర‌భుత్వం త‌క్ష‌ణం ఇలాంటి చ‌ర్య‌ల‌ను విర‌మించుకోవాల‌ని ఆమె హిత‌వు ప‌లికారు .

dk aruna

tags: DK Aruna Strong Counter to KTR,kcr,ktr,harish rao,trs bhavan,gandhibhavan,dk aruna,gadwal mla,ex minister dk aruna,dk bharatasimha reddy,mahaboob nagar congress,mahaboob nagar trs,jupally krishna rao,minister laxmareddy,trs niranjan reddy,congress mlas,congress meetings,uttam kumar reddy,janareddy,bhatti vikramarka,shabber ali,alampur mla,uttam kumar reddy bus yathra

Related Post