రాహూల్ సంధించిన అస్త్రం

news02 Jan. 29, 2019, 7:28 a.m. political

rahul

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయాన్ని కల్పిస్తామని రాహూల్ గాంధీ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన  కిసాన్‌ ఆభార్‌ సమ్మేళనంలో రాహూల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. హరిత విప్లవానికి పునాదులు వేసిన కాంగ్రెస్‌.. క్షీర విప్లవాన్నీ, టెలికాం విప్లవాన్నీ తెచ్చిందని ఈ సందర్బంగా రాహూల్ గుర్తు చేశారు. దేశంలో ఆహార భద్రత కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొంది కూడా కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. అదే బాటలో ఇప్పుడు పేదలందరికీ కనీస ఆదాయ భరోసా కల్పించాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నామని రాహూల్ చెప్పారు. 

rahul

రాబోవు సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతృత్వంలో దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పధకం ద్వారా పేదరికం, ఆకలి లేని భారత్‌ను సాకారం చేస్తామన్న రాహూల్ గాంధీ.. ఇది తమ స్వప్నమని పేర్కొన్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని పలు మార్లు అడిగినా డబ్బుల్లేవన్నారని చెప్పిన రాహూల్.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే మాట చెప్పి తప్పించుకున్నారని రాహూల్ గుర్తు చేశారు. అటు దిల్లీలోను ప్రధాని మోదీ కూడా  రుణమాఫీ విషయంలో ఇదే పాట పాడారని రాహూల్ మండిపడ్డారు. అన్నదాతల రుణాలను మాఫీ చేసేందుకు మన దేశ కాపలాదారు వద్ద 6 వేల కోట్లు లేవుగానీ... 15 మంది పారిశ్రామికవేత్తలకు 3.5 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేయడానికి డబ్బులుంటాయని ఎద్దేవా చేశారు. చత్తీస్ గడ్ లో 15 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం చేయలేనిది 24 గంటల్లో కాంగ్రెస్ చేసి చూపించిందని రాహూల్ చెప్పారు. 

tags: rahul, rahul gandhi, rahul gandhi on common minimum income, rahul about common minimum income

Related Post