రాహుల్ వ‌స్తే.. కేసీఆర్ కు ఇబ్బందేమీటీ..?

news02 Aug. 10, 2018, 10:22 a.m. political

rahula gandhi, greter hyderabad tour, kcr, pressers, haritha plaza

హైద‌రాబాద్ : రాహుల్ గాంది నుండి లెట‌ర్ తీసుకురండి.. అప్పుడే ఇక్క‌డ రూమ్ ఇస్తాం.. లేదంటే ఇచ్చేది లేదు.. ఇది ప్ర‌భుత్వ గెస్ట్ హ‌స్ అధికారి ఇచ్చిన స‌మాదానం. న‌గ‌రానికి వ‌స్తున్న‌రాహుల్ గాంది బ‌స చేసేందుకు రూమ్స్ అడిగిన కాంగ్రెస్ నేత‌కు.. హైద‌రాబాద్ లోని ప్ర‌భుత్వ గెస్ట్ హౌస్ హ‌రితా ప్లాజా అదికారులు ఇచ్చిన రిప్లేనే. అదేంటీ టిఆర్ఎస్ గ‌ల్లీ నేత ఫోన్ చాలు.. రూమ్ స‌ర్దిపెట్టే హ‌రితా ప్లాజాలో ఏకంగా రాహుల్ గాంధికే నో అన్నారా..? అవునంటున్నారు తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. 

uttham kumara reddy, tpcc cheif, telangana governament, cheif secretary sailendra joshi

న‌గ‌రంలో రాహుల్ గాంది ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలా అడ్డంకులు సృఫ్టింస్తుందో.. ఈ సంఘ‌ట‌న‌నే అద్దం ప‌డుతుందంటున్నారు హ‌స్తం పార్టీ నేత‌లు. ఎంపీగా. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్య‌క్షులుగా ఉన్న‌రాహుల్ గాంధి ప‌ట్ల ప్ర‌భుత్వం క‌నీసం ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. హ‌రితా ప్లాజా అధికారుల తీరుపై ఆగ్ర‌హంతో ఊగిపోయిన పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్.. నేరుగా   తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శైలేంద్ర కుమార్ జోషికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఎంపీగా, జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ ర‌క్ష‌ణ లో ఉండే రాహుల్ గాంధికి క‌నీస ప్రొటోకాల్ పాటించ‌క పోవ‌డం ఏంటని జోషిని ప్ర‌శ్నించారు ఉత్త‌మ్. రాహుల్ ను ప్ర‌భుత్వ గెస్ట్ గా చూడాల్సింది పోయి.. ఆయ‌న బ‌స‌చేసేందుకు ఇబ్బందులు ఎందుకు క‌ల్గిస్తున్నార‌ని నిల‌దీశారు.? అధికారులుగా మీరు ప్ర‌భుత్వ‌ విధులను మాత్ర‌మే నిర్వ‌హించండి అని క్లాస్ పీకారు. అంతేకాదు.. టీఆర్ఎస్ ఎల్ల‌కాలం అదికారంలో ఉండ‌ద‌న్న‌సంగ‌తి గుర్తుంచుకోవాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఉత్త‌మ్ ఫోన్ కాల్ తో ఖంగుతిన్న జోషి.. తాను వివ‌రాలు తెలుసుకుంటానని ఉత్త‌మ్ కు చెప్పారు. 

rahul gandhi, kcr ,hyedarabad tour, greter , ts govt

అంతేకాదు న‌గ‌రంలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు అడుగ‌డుగునా ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోంద‌ట‌. చారిత్ర‌క ఉస్మానియా యునివ‌ర్సీటిని రాహుల్ సంద‌ర్శించ‌కుండా అడ్డుకుంటుంది అధికార పార్టీ. టిఆర్ఎస్ త‌మ అనుకూల విధ్యార్థి సంఘాల‌తో రాహుల్ రాక‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆంధోళ‌న‌లు చేయిస్తుంది. ఇప్ప‌డికే టిఆర్ఎస్ అనుబంధ విధ్యార్థి సంఘం ఓయు వీసి, హోంమంత్రి నాయిని న‌ర్సింహ్మా రెడ్డి కి రాహుల్ రాక‌ను అడ్డుకోవాల‌ని విన‌తి ప‌త్రాల‌ను అంద‌చేసింది. ఇక ఇదే కాకుండా.. రాహుల్ నాంప‌ల్లీలో ఓ కాలేజి గ్రౌండ్ లో ముస్లీం మేధావులు, మ‌త పెద్ద‌లు, ముస్లీం యువ‌త‌తో స‌మావేశం ఫిక్స్ అయ్యింది. దీనికి ఆ కాలేజి యాజ‌మాన్యం నుండి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ ఆలీ ఇప్ప‌డికే అనుమ‌తి కూడా తీసుకున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసి అల‌ర్ట్ అయిన అదికార పార్టీ నేత‌లు .. రాహుల్ మీటింగ్ కు అనుమ‌తి ఇవ్వ వ‌ద్ద‌ని ..ఆ స‌ద‌రు కాలేజి యాజ‌మ‌న్యంపై వ‌త్తిడి తెచ్చార‌ట‌. దీంతో ఆ యాజ‌మాన్యం త‌మ కాలేజి గ్రౌండ్ లో రాహుల్ మిటింగ్ కు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని తేల్చిచెప్పార‌ట‌. అదేమ‌ని అడిగితే.. ప్ర‌భుత్వ వ‌త్తిడి ఉంది,, మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌కండి అంటు కాంగ్రెస్ నేత‌ల‌ను వేడుకుంటున్నార‌ట‌. 

rahula gandhi, osmania university, students,arts college,kcr

ఇలా రాహుల్ టూర్ ను విఫ‌లం చేసేందుకు ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుందన‌డానికి ఈ ఉదంతాలే సాక్షం అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. అయితే అర‌వై ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష‌లు నెర‌వేర్చి తెలంగాణ‌ రాష్ట్రాన్నిఇచ్చిన సోనియా గాంధి కుమారుడు..  రాహుల్ గాంధి ప‌ట్ల కేసీఆర్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

tags: rahul gandhi tour, greter hyaderabad, ts governament political pressers, rpcc, uttham kumar reddy, osmania students,cs shailendra joshi, uttham phone call ,cs, rahul setilars, muslim meeting with rahul, rahul ou vigit,

Related Post