వీవీప్యాట్ ల్లో స్లిప్పుల మాయంపై కాంగ్రెస్ సీరియ‌స్ ..!

news02 Dec. 27, 2018, 10:10 p.m. political

congress

హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులు మాయమవడంపై అభ్యంత‌రంవ్య‌క్తం చేసిన కాంగ్రెస్ ..  రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ అంశంపై పిర్యాదు చేసింది. హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలన్న తొందరలో అధికారులు వరుస తప్పిదాలకు పాల్పడ్డారని హ‌స్తం నేత‌లు ఆరోపిస్తున్నారు. వీవీప్యాట్ లలో స్లిప్పులు లేకుండా చేయ‌డం పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని .. దీనిపై  తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అంటోంది. ఓట్ల తొల‌గింపు తో ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల ఓటు హ‌క్కును ఎన్నిక‌ల సంఘం కాల‌రాసింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


 congress
ఈవీఎం ల అవ‌క‌త‌వ‌క‌ల పై తాము న్యాయ‌స్థానాన్నిఆశ్రయిస్తే వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులు మాయం చేసి .. సాక్ష్యాలు లేకుండా చేశారని హ‌స్తం నేత‌లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా సీఈవో రజత్ కుమార్‌.. కాంగ్రెస్ ఫిర్యాదుపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే తమకు నమ్మకం లేదని .. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధి బృందాన్ని పంపి విచారణ జరపాలని ఈసీని క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు నిరంజన్ .. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూంలో వీవీప్యాట్ స్లిప్పులను తనిఖీ చేయాలన్నారు. కేవలం ఆధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోకుండా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని నిరంజన్, విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

tags: Congress Complent to Election Commission,Congress,Gandhibhavan,EC,EVMS,Niranjan,Ex mla Vishnuvardhanreddy,Uttamkumarreddy,Revanthreddy,kcr,ktr,harishrao

Related Post