కేసీఆర్ ప్ర‌భుత్వంలో అవినీతి

news02 March 30, 2018, 7:45 a.m. political

cag report 2017-18

హైద‌రాబాద్ః సీఎం కేసీఆర్ కు కాగ్ షాక్ ఇచ్చింది. అస‌లు అవినీతే లేదు.. పెట్టిన డ‌బ్బుల‌న్నింటికి లెక్కుంది అని గొప్ప‌లు చెప్పే గులాబీ నేత‌ల అస‌లు బండారాన్ని కాగ్ రిపోర్టు బ‌య‌ట‌పెట్టింది. ఇసుక దందా నుంచి మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, సాగునీటి ప్రాజెక్టుల వ‌ర‌కు జ‌రిగిన అవినీతిని బ‌ట్ట‌బ‌య‌టు చేసింది. అసెంబ్లీ చివ‌రిరోజున స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన కాగ్ రిపోర్టు  కేసీఆర్ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న త‌తంగాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది.

కాగ్ రిపోర్టు లోని ముఖ్యాంశాలు

24 గంట‌ల విద్యుత్ తో ప్ర‌జ‌ల‌పై భారం

రైతులు వ‌ద్ద‌ని మొత్తుకుంటున్నా సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంట‌ల క‌రెంటు తో న‌ష్టాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కాగ్ పేర్కొంది. తెలంగాణ లో 24 గంట‌ల‌కు స‌ఫ్లై చేసేంత ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ లేక‌పోవ‌టంతో చ‌త్తీష్ గ‌డ్‌, ఏపీ తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి విద్యుత్ ను అధిక ధ‌ర‌లు చెల్లింలి కొంటున్నారు. దీంతో రాష్ట్ర ఖ‌జానాపై 5,820 కోట్లు భారం ప‌డిన‌ట్లు కాగ్ పేర్కొంది.

ఇసుక కొన్న‌వారికి పండ‌గే..
రాష్ట్రంలో ఇసుక మాఫియా వ్య‌వ‌హారం అంద‌న‌రికి తెలిసింది. ఆన్ లైన్ లో ఇసుక‌ను అమ్ముతున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా అందులో మోసం ఎక్క‌డ జ‌రుగుతుందో కాగ్ వివ‌రించింది. ఇసుక కొనుగోలుదార్ల‌కు 2015 లో 18 కోట్ల పైచిలుకు ల‌బ్ది చేకూరే విదంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ బ‌య‌ట‌పెట్టింది.

cag report on sand mafiya

ప‌ద్ద‌తి త‌ప్పిన ప‌ద్దులు
రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నా దాన్ని ఖ‌ర్చు చేయ‌టంతో విఫ‌ల‌మ‌య్యార‌ని కాగ్ దుయ్య‌బ‌ట్టింది. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో 5392 కోట్ల రెవెన్యూ లోటు ఉంటే 1386 కోట్ల‌ రెవెన్యూ మిగులుగా చూపించ‌డాన్ని కాగ్ త‌ప్పు బప‌ట్టింది.

ఎస్సీల‌ను మూడెక‌రాల భూమి ఏది..?
ఎన్నిక‌ల ముందు కేసీఆర్ ప్ర‌న‌క‌టించిన ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి పంప‌కాల‌పై కాగ్ రిపోర్టు ఇచ్చింది. మూడేళ్ళ‌లో 12587 మంది అబ్ది దారుల‌ను ప్ర‌భుత్వం గుర్తించినా 2866 మందికి మాత్ర‌మే భూమిని పంచ‌గ‌లిగారు. అక్క‌డ‌క్క‌డ అన‌ర్హుల‌కు కూడా భూమి ఇస్తుండ‌టంతో అస‌లు ల‌బ్దిదారుల‌కు ఫ‌లితం ద‌క్క‌టం లేదు. కరీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూరు నియోజ‌క‌వ‌ర్గంలో 7 మంది అన‌ర్హులుగా తేలిన విష‌యాన్ని పేర్కొంది. ఎస్సీ ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులల‌ను ఖ‌ర్చు చేయ‌టం లేద‌ని కాగ్ అక్షింత‌లు వేసింది.
cag report on mission bageeratha

ఫ్యాబ్ సిటీలో ఉద్యో్గాలు క‌ల్పించ‌ని ప్ర‌భుత్వం
రంగారెడ్డి జిల్లా హ‌హేశ్వ‌రం ద‌గ్గ‌ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఫ్యాబ్ సిటీలో ఉద్యోగాలు క‌ల్పించ‌టంలో స‌ర్కారు వైఫ‌ల్యం చెందింద‌ని కాగ్ తేల్చింది. 1075 ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాబ్ సిటీలో 5 ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్పి 3016 మందికి మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చార‌ని తేల్చింది.

మిష‌న్ కాక‌తీయ ఫ‌లితాలేవి..
తెలంగాణ ప్ర‌భుత్వం రాగానే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్టు మిష‌న్ కాక‌తీయ‌. ఇప్ప‌టికే మూడు ద‌శ‌ల్లో చెరువుల్లో పూడిక తీశారు. దీనికోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల 60 వేల ఎక‌రాల సాగుభూమిని మిష‌న్ కాక‌తీయ వల్ స్థిరీక‌రించామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే గ్రౌండ్ లో అంత‌సీన్ లేద‌ని కాగ్ తేల్చింది. మిష‌న్ కాక‌తీయ వ‌ల్ల చెరువులు నింపి ఇదిగో నింపాం అని చెప్పుకోవ‌టం త‌ప్ప డిస్టిబ్యూష‌న్ చాన‌ల్స్ ను పున‌రుద్ద‌రించ‌క‌పోవ‌టంతో పొలాల‌కు నీళ్లు వెళ్ళ‌లేదు. చెర‌వుల్లో నీళ్ళు అయిపోతే మ‌ళ్ళీ నింప‌లేరు కాబ‌ట్టి ప్ర‌భుత్వం ఆప‌ని చేయ‌లేద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.

cag report on mission kakthiya

ప్ర‌జ‌ల ఆరోగ్యం గాలికి
ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కూడా కార్పోరేట్ వైద్యం అందిస్తామ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నా అదంతా ఉట్టి ఆర్బాట‌మేన‌ని కాగ్ తేల్చింది. బ‌డ్జెట్ కేటాయంపులు ఆస్థాయిలో లేవ‌ని కాగ్ పేర్కొంది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేక ప్రైవేట్ ఆసుపత్రుల‌కు వెలుతున్నార‌ని కాగ్ పేర్కొంది. ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో 69 శాతం ఉన్న ప్ర‌స‌వాలు ఇప్పుడు 42 శాతానికి ప‌డిపోయాయి. జాతీయ ఆర‌నోగ్య శాఖ మిష‌న్ కింద కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. 2014-2017 లో 39 శాతం నిధులు మాత్ర‌మే వాడారు.

ఐటీ కంప‌నీలు వెన‌క్కి
స‌రైన వ‌స‌తులు క‌ల్పించ‌టంతో ప్ర‌భ‌తు్వం వైఫ‌ల్యం చెంద‌టంతో ఐటీ కంప‌నీలు రావ‌టం లేద‌ని కాగ్ రిపోర్టు పేర్కొంది. ఐటీ హ‌బ్ కూడా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. అందులో 250 స్టార్ట‌ప్ లు వ‌స్తే 50 శాతం కూడా స‌క్సెస్ కాలేద‌ని కాగ్ తేల్చింది. టీహ‌బ్ 2 నిర్మాణం వ్య‌వ‌హారంలో 16.70 కోట్ల అవినీతి జ‌రిగిన‌ట్లు పేర్కొంది.

tags: cag report, cm kcr, mission bageeratha, mission kakatheeya, sc st sub plan, 2018-19 budget, telangana budget, sand mafiya, it sector in ts.

Related Post