మోడీతో పోటీకి సై ..

news02 April 13, 2019, 10:01 p.m. political

Priyanka gandhi

ఢిల్లీ : ప్రియాంక గాంధీ పార్లమెంట్ బరిలో దిగనున్నారా .. ఈ ఎన్నికల్లో ఆమె ప్రధాని నరేంద్ర మోడీ తలపడనున్నారా .. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు . తీవ్ర సమాలోచనల అనంతరం ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసేందుకు సుమఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.పార్టీ అధిష్ఠానం నిర్ణయమే తరువాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Priyanka gandhi

ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో గత మార్చిలో ప్రియాంక సంకేతాలు ఇచ్చారు. తన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు ప్రియాంకకు విజ్ఞప్తి చేసినప్పుడు, వారణాసి నుంచి ఎందుకు చేయకూడదు .. అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. యూపీలో పార్టీని పటిష్టపరచే బాధ్యతను తనకు అప్పగించారని, ఒకవేళ పార్టీ అధిష్ఠానం కోరితే లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని లక్నోలో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

tags: Priyanka Gandhi, Soniya Gandhi, Rahul Gandhi, Narendra Modi,uttarpradesh,Loksabha Election, Varanasi, Congress, BJP

Related Post