ఆ ఊర్లో స‌గం మందే స‌ర్పంచ్ ను ఎన్నుకుంటారా..!

news02 Jan. 8, 2019, 11:14 p.m. political

/variety_sarpanch, telangana

పెద్దపల్లి : ప‌ంచాయితీ ఎన్నిక‌లు అంటే.. ఎక్క‌డైనా..ఓ గ్రామానికి  ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. ఆ ఊరులో ఉన్న‌ప్ర‌తి ఓట‌రు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుని.. ఆ గ్రామానికి స‌ర్పంచ్ ను ఎన్నుకుంటారు. ఇది ఎక్కైడైనా జ‌రుగుతుంది. కాని .. ఒక ఊరిలో స‌గం మందికే స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌రిగితే..? విన‌టానికే వింత‌గా ఉంది క‌దూ..  కాని జ‌రిగితే.. అది హండ్రెడ్ ప‌ర్సెంట్ విచిత్ర‌మే.. అవును దీనికి  వేదిక‌గా నిలుస్తుంది పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని  గొల్ల‌పల్లి గ్రామము. వివ‌రాల్లోకి వెలితే...

అది పెద్దపల్లి జిల్లాలోని గొల్లపల్లి గ్రామం. ఈ గ్రామంలో  ఈ సారి పంచాయతీ ఎన్నికలు సగం గ్రామానికే జరుగుతున్నాయి. విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం.  గొల్లపల్లి గ్రామము రెండు పంచాయతీలకు అనుబంధంగా ఉండటమే ఈ విచిత్రానికి  కారణం. ఆ ఊర్లో..జ‌నాభా 415 మంది.  ఈ గొల్ల‌ప‌ల్లి ఊరు మ‌ధ్య‌లో ఓ సీసీ రోడ్ ఉంది.  ఆ రోడ్డుకు ఉత్తరం వైపు రాఘవాపూర్ పంచాయతీ పరిధిలో ఉండగా.. దక్షిణ వైపు బంధంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అయితే ఈ బంధంపల్లి పంచాయతీ పెద్దపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో మున్సిపాలిటిలో క‌ల‌ప‌డంతో.. అక్క‌డ ఇప్పుడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంలేదు. ఇక ఉత్త‌రం వైపు ఉన్న‌రాఘావాపూర్ గ్రామ‌పంచాయితీకి అనుబంధంగా ఉన్న గొల్ల‌ప‌ల్లిలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో..ఆ గ్రామములో స‌గం ఊరికే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దీనితో..ఊరు ఒక్క‌టైనా.. ఊర్లో ఉన్న‌ స‌గం మంది ఓటర్లు మాత్ర‌మే ..ఆ ఊరికి స‌ర్పంచ్ ను ఎన్నుకోబోతున్నార‌న్న మాట‌. సో.. ఇది టోట‌ల్ పంచాయితీ ఎన్నిక‌ల‌కే స్పెషల్ క‌దూ..ఏమంటారు..!!


peddapally, telangana

tags: variety sarpanch, telangana, panchayathi elections, peddapally district, diffarent sarpanch elections,

Related Post