కేసీఆర్ రాక్ష‌స క్రీడ దేశ‌వ్యాప్తంగా వ్యాపిస్తోంది ..!

news02 April 30, 2019, 10:40 p.m. political

vijayashanthi

హైద‌రాబాద్ : ప్రధాని న‌రేంద్ర మోదీ .. కేసీఆర్ ల‌పై తెలంగాణ  కాంగ్రెస్ క్యాంపెయినింగ్ కమిటీ  చైర్మెన్ విజయశాంతి ఫైర్ అయ్యారు. త‌న ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతుంద‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌న్న ఆమె .. కేసీఆర్ ప‌థ‌కాల‌ను మోదీ కాపీ కొడుతున్నారో లేదో కానీ .. ఎమ్మెల్యేల‌ను ప్రలోభ పెట్టడంలో మోదీకి కేసీఆర్ ఆదర్శమయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్ వేదికగా స్పందించిన విజ‌య‌శాంతి .. ఈ రాక్షస క్రీడ తెలంగాణలో మొదలై .. దేశమంతా మహమ్మారిలా వ్యాపిస్తోందన్నారు. దీన్ని అడ్డుకునేందుకు ఓ బలమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. ఆమె ఫేస్‌బుక్ లో చేసిన పోస్ట్ లో ఏం చెప్పారంటే ..
 vijayashanthi
రైతుబంధు పేరుతో తాము ప్రవేశపెట్టిన పథకాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కాపీ కొట్టిందని కేసీఆర్ ఇంతకాలం కథలు చెప్పారు. కేసీఆర్ ను చూసి, సంక్షేమ పథకాలను కాపీ కొట్టారో లేదో కానీ.. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, తమవైపు ఎలా లాక్కోవాలో అనే కుట్రను నరేంద్ర మోదీ గారు, కేసీఆర్ ని చూసి బాగా వంట బట్టించుకున్నట్లున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మమత ప్రభుత్వం కూలిపోతుందని మోదీ  హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఈ రాక్షస క్రీడ తెలంగాణలో మొదలై, దేశమంతా మహమ్మారిలా వ్యాపిస్తోంది. ఈ దుస్సాంప్రదాయానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సంస్కరించి, పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై వెంటనే వేటు వేసే విధంగా నిబంధనలు తీసుకు వస్తామనే అంశాన్ని చేర్చడం జరిగింది. 

vijayashanthi

కాంగ్రెస్ ఛీప్ రాహూల్ గాంధీ  తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ సమర్థించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ వైపు సీబీఐ, ఐటీ దాడుల పేరుతో ప్రతిపక్షాలకు చెందిన నేతలను భయాందోళనకు గురిచేస్తూ, మరోవైపు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపుతోంది. ఈ పరిణామాలకు చరమగీతం పాడేందుకు రాహూల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

vijayashanthi

tags: VIJAYASHANTHI,KCR,NARENDRA MODI,TRUNAMUL CONGRESS,BJP,TRS,CONGRESS,TRS MLAS,CONGRESS MLAS,MLAS DIFFECTIONS,TELANGANA,TS GOVT

Related Post