కార్గిల్ యుధ్దంలో దృడత్వం..

news02 Aug. 16, 2018, 8:32 p.m. political

bill clinton

ఇంటర్నేషనల్ డెస్క్ (రీసెర్చ్)- అది 1999వ సంవత్సరం. పాకిస్థాన్ ఎప్పటిలాగే తన దుస్సాహసాన్ని ప్రదర్శించింది. భారత భూబాగంలోని కార్గిల్ ను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. తమ సైన్యాన్ని కార్గిల్ కొండ చరియల్లో మోహరించి మెల్ల మెల్లగా కాల్పులకు పాల్పండి. ఇక అప్పుడు ప్రధానిగా ఉన్న వాజ్ పేయీ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. కార్గిల్ లో పాకిస్థాన్ తో యుధ్దాన్ని ప్రకటించారు. కార్గిల్ మంచు కొండల్లో మన సైనికులు పాకిస్థాన్ సైన్యంపై భీకర పోర సలిపారు. 

vajpayee bill clinton

ఇక ఇదే సమయంలో కార్గిల్ యుధ్ద వార్త తెలుసుకున్న అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ హుటాహుటిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను న్యూయార్క్ పిలిపించారు. ఇటు భారత ప్రధాని వాజ్ పేయీని రమ్మని కబురు పెట్టి.. ఇరువురి చర్చలకు ప్రయత్నించారు. ఐతే వాజ్ పేయీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాము పాకిస్థాన్ పే యుద్దానికి దిగలేదని.. పాక్ దుశ్చర్యను మాత్రమే తిప్పికొడుతున్నామని దైర్యంగా తేల్చి చేప్పారు. దీంతో బిల్ క్లింటన్ పాకిస్థాన్ అధ్యక్షుడిని హెచ్చరించడం.. అప్పటికే పాక్ సైన్యం చతికిల పడటంతో తొక ముడిచి కార్గిల్ నుంచి వెళ్లిపోయాయి. వాజ్ పేయీ ధైర్యానికి.. ధృడ వైఖరికి నిదర్శమని చెప్పవచ్చు.

kargil

 

tags: kargil, vajpayee, vajpayee on kargil, kargil war, vajpayee about kargil war, vajpayee at kargil, vajpayee about bill clinton, vajpayee with bill clinton

Related Post