బాలాజీ ఆగ్రహానికి గురికావద్దు

news02 Feb. 3, 2019, 8:09 a.m. political

manoj

మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రధాని మోదీని గట్టిగా హెచ్చరించారు. ఏపీ ప్రత్యేక హోదాపై తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా చేసిన హామీని నేరవేర్చకపోతే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో మంచు మనోజ్ ఘటుగా స్పందించారు. మేం మీకు మద్దతుగా నిలిచాం. మీ పోరాటంలో తోడుగా నడిచాం. ఇన్నాళ్లు మా ఆశల్ని నెరవేరుస్తారని ఎదురు చూశాం. కానీ మీ నుంచి సరైన స్పందన రాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమేకాక బడ్జెట్‌లో కనీస గౌరవం కూడా దక్కలేదు. సమయం ఆసన్నమైంది. మా డిమాండ్‌ను గౌరవిస్తూ.. ఇప్పటికైనా ప్రత్యేక హోదా మంజూరు చేయండని మంచు మనోజ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, విభజన హామీలు, ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో మంచు మనోజ్ ఈ విధంగా స్పందించారు. 

 

tags: manoj, manchu manoj, manchu manoj warned pm modi, manchu manoj warning to pm modi, manchu manoj about pm modi

Related Post