ముస్లింను కేసీఆర్ మోసం చేశాడు..

news02 Nov. 4, 2018, 2:44 p.m. political

uttam

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన ముస్లింలకు బడ్జెట్‌లో 12 శాతం నిధులు కేటాయిస్తామని, విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు అవసరమైన విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ముస్లింలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్‌ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్‌ వారిని మోసం చేశారని పీసిసి చీఫ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బాగ్‌ అంబర్‌పేటలో జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధ్యక్షులు, ముస్లిం మైనారిటీలతో ఉత్తమ్‌ భేటీ అయ్యారు. 

uttam
 
ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ముస్లింలు చిత్తుగా ఓడించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ఏజెంట్‌గా మారితే.. కేసీఆర్‌కు ఏజెంట్‌గా ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ పనిచేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే ముస్లిం పర్సనల్‌ లా బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని పీసిసి చీఫ్ హామీ ఇచ్చారు. మక్కా మసీదు పేలుళ్లపై ప్రభుత్వం ఎందుకు అప్పీలుకు వెళ్లలేదో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ఈ సందర్బంగా ఉత్తమ్ డిమాండ్‌ చేశారు. ఆలేరులో వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై నివేదికను బయటపెట్టకుండా కేసును నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మహాకూటమి అధికారంలోకి రాగానే విధ్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రతి సంవత్సరం రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. మొత్తం 46 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్న విధ్యా రంగాన్ని పరిరక్షిస్తామని తెలిపారు. 

uttam

ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు మార్పు కోసం-మనుగడ కోసం అనే నినాదంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు ఉత్తమ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యాసంస్థల యాజమాన్యాలకు సీఎం కేసీఆర్‌ చేసిన అవమానాలను మరిచిపోవద్దన్నాని సూచించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించిన కేసీఆర్‌కు కష్టపడి చదువుకునే నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయిబర్స్‌మెంట్‌ మాత్రం ఇవ్వడానికి మనసు రావడం లేదని ఉత్తమ్ ఆవేధన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

tags: uttam, uttam kumar reddy, pcc chief uttam kumar reddy, uttam in muslim minority meeting, uttam promisess about muslims

Related Post