మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దు

news02 Feb. 6, 2019, 8:28 a.m. political

babu mamata

శారదా కుంబకోణానికి సంబందించి కోల్ కత్తా పోలీస్ కమీషనర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విజయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కోల్‌ కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సత్యాగ్రహ దీక్షకు చంద్రబాబు మద్దతు తెలిపారు. శారదా కుంబకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించడాన్నిఈ సందర్బంగా చంద్రబాబు స్వాగతించారు. కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు తమ పోరాటం కొనసాగిస్తాయని తేల్చి చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం దిల్లీలో ఫిబ్రవరి 13 లేదా 14 తేదీల్లో సమావేశమవుతామని చంద్రబాబు వెల్లడించారు. 

babu

భారీ కుంబకోణం రఫేల్‌ ఒప్పందంపై కేంద్రం వివరాలు వెల్లడించడం లేదని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో బ్యాంకులన్నీ నష్టపోయాయని, ఎగవేతదారులు దేశం నుంచి పారిపోయారని, ప్రభుత్వం వారికి దగ్గరుండి పాస్‌ పోర్టులు సమకూర్చిందని మండిపడ్డారు. తానూ సీనియర్‌ నేతనే అన్న చంద్రబాబు.. నరేంద్రమోదీ వంటి ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని వాపోయారు. భవిష్యత్తులో కూడా చూసే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న ముఖ్యమంత్రి.. ఎవరైనా గొంతెత్తితే అణచివేస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం మరింత అపహాస్యమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. 

tags: babu, chandra babu, mamata , mamata benarjee, babu meet mamata, cm babu support mamata dharna, chandra babu support mamata dharna in kolkatta

Related Post