జ‌య‌రాం ఎందుక‌లా చేశాడు..!

news02 Feb. 8, 2019, 9:10 a.m. political

/jayaram_marder_case

హైదరాబాద్ : బిజినెస్ మెన్ , ఎక్స్ ప్రెస్ టీవీ ఓన‌ర్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసు స‌ప్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. జ‌యరాంను చంపింది రాకేష్ రెడ్డి అని  ఏపీ పోలీసు్ తేల్చినా...ఈ కేసును మ‌రింత లోతుగా దర్యాప్తు చేస్తామంటున్నారు. ఈకేసులో సెంట‌ర్ పాయింట్ గా ఉన్న‌శిఖా చౌద‌రిపైనే అనుమానాలున్నాయ‌ని.. జ‌య‌రాం మ‌ర్డ‌ర్ కు కర్త క‌ర్మ క్రియ శిఖా చౌద‌రే అని జ‌య‌రాం భార్య  ప‌ద్మ‌శ్రీ ఆరోపించ‌డంతో.. ఇంకా మ‌రిన్ని మ‌లుపుల‌కు కార‌ణ‌మైంది. అంతేకాదు.. జ‌య‌రాం భార్య ప‌ద్మ‌శ్రీ పిర్యాదు తో  కేసును తెలంగాణ పోలీస్ కు  బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే... ఈకేసులో ఎన్నో ప్ర‌శ్న‌లు.. మ‌రెన్నో చిక్కుముడులు తెరపైకి వ‌స్తున్నాయి.  అంత పెద్ద కోటీశ్వ‌రుడి చావుకు ఇంత చిన్న‌కార‌ణ‌మా.. అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ర్డ‌ర్ కేసులో స‌మాధానం రావాల్సిన  ప్ర‌శ్న‌లు ఇవే..!  

jayaram_marder_case_suspens.

* జ‌య‌రాం ను  హత్య చేసిన ఇంట్లో ఐదుగురు భోజనం చేసిన ఆనవాళ్లు..! 
* మ‌రి  రాకేశ్‌, జయరాంతో పాటు  ఆ మిగిలిన ముగ్గురు ఎవరు..?
* జయరాం మరణ వార్తను శిఖా కు చెప్పింది ఎవరు..?
* జయరాం ఇంట్లో ఆస్తి పత్రాల కోసం వెళ్లిన శిఖా వెంట ఉన్న‌వ్య‌క్తి ఎవరు..?
* శిఖా తీసుకువెళ్లిన ప‌త్రాల‌కు .. రాకేశ్‌కున్న సంబంధం ఏంటి..?
* జయరాం దగ్గర రూ. 4.5 కోట్లు లేవా..? వేల కో్ట్ల అదిప‌తుల‌తో సంబంధాలున్నా జ‌య‌రాం..రాకేశ్‌ దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నాడు..?
* జ‌యారాం తో రాకేశ్‌తో పరిచయం ఎలా..? రాకేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి..? అప్పుకు, హత్యకు లింకేంటి..?
* జ‌య‌రాం..పరిచయం లేని మహిళ రమ్మంటే ఎలా వెళ్లాడు..? ఇది నిజ‌మా.. లేక రాకేష్ క‌ట్టుక‌థ‌నా..? 
* ఆ  6 లక్షలు అరేంజ్‌ చేసింది ఎవరు..? డబ్బు తీసుకున్నది ఎవరు..?
* రాకేష్.. జ‌య‌రాం  గొంతు నులిమి చంపితే.. తలపై గాయం ఎలా అయ్యింది..?
* మ‌ర్డ‌ర్ చేసింది రాకేష్ అని తేల్చిన ఏపీ పోలిస్.. ఇంకా విచారించాల్సింది ఎవ‌రిని.? 

tags: jayaram chigurupati, marder, express tv woner, bussines men jayaram, ap police, telangana police, shikha choudary, rakesh reddy, jayaram wife padmashri, hyderabad, vijayavada

Related Post