స్వయంగా కోర్టుకు హాజరవ్వండి..

news02 Aug. 14, 2018, 7:12 p.m. political

hi court

హైదరాబాద్- వరుసగా హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టకాయలు పడుతున్న సంగతి తెలిసింది. ఇదిగో ఇప్పుడు ఇదే క్రమంలో మరోసారి కేసీఆర్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు గన్ మెన్ లను కెటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ జిల్లా ఎస్పీకి, నల్గొండ జిల్లా ఎస్పీకి కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు సభలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంగా వారిరువురి ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన కోర్టు స్పీకర్ నిర్ణయంపై స్టే విధించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యేలు గా కొనసాగించాలని తీర్పునిచ్చింది.

assembly

ఐనప్పటికీ స్పీకర్ కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోలేదు. సదరు ఎమ్మెల్యేలిద్దరికి వెంటనే అన్ని సదుపాయాలు కలిగించాలని కోర్టు సూచించినా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు హాైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా సెక్రెటరికి ఫారమ్-01 నోటీసులు జారీ చేసింది. 17 సెప్టెంబర్ రోజుల అసెంబ్లీ సెక్రెటరి నరసింహా చార్యులు, అసెంబ్లీ లా సెక్రెటరి నీరంజన్ రావు నేరుగా కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతభత్యాలకు సంబందించిన వివరాలను రిజిస్టార్ ఆఫ్ కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని హైాకోర్టు ప్రభత్వానికి హెచ్చరించింది.

tags: hi court, hi court on congress mlas, hi court on assembly, hi court on assembly secretary, hi court on sampath, hi court on komatireddy, hi court notices to assembly

Related Post