ధర్నా చౌక్ పై ఆక్షలు ఎత్తేసిన కోర్టు..

news02 Nov. 13, 2018, 10:38 p.m. political

hi court

ఆపధ్దర్మ టీఆర్ ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. చాలా  అంశాల్లో.. చాలా సందర్బాల్లో కేసీఆర్ సర్కార్ కు మొట్టికాయలు వేసిన హైకోర్టు.. మరోసారి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ను ఎత్తివేస్తూ కేసీఆర్ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా స్వామ్యంలో నరజన తెలపడం రాజ్యాంగం ఇచ్చన హక్కు. కానీ కేసీఆర్ ఆ హక్కును కాలరాసే విధంగా ధర్నా చౌక్ ను ఎత్తివేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

hi court

కేసీఆర్ సర్కా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చాలా ప్రజా సంఘాలతో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతా రావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారించిన హైకోర్టు.. కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇందిరాపార్క్ దగ్గరున్న ధర్నా చౌక్‌పై హైకోర్టు ఆంక్షలు ఎత్తేసింది. తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల అనుమతితో ఆరు నెలల పాటు ధర్నాలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆపధ్దర్మ కేసీఆర్ సర్కార్ కు హైకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు.

tags: dharna chowk, hi court on dharna chowk, hi court about dharna chowk, ts hicourt about dharna chowk, hi court on indirapark dharna chowk

Related Post