రాహూల్-ఉత్తమ్ సమక్షంలో..

news02 Sept. 14, 2018, 2:38 p.m. political

bandla ganesh

న్యూఢిల్లీ-  ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ, పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసిందని ఈ సందర్బంగా బండ్ల ఆయన అన్నారు. తనకు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని.. అందుకే ఈ పార్టీలో చేరారని బండ్ల గణేష్ చెప్పారు. రాహూల్ గాంధీ ఆదేశాలమేరకు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పిన గణేష్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా.. లేదంటే ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఐతే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరిక అని మసులో మాట బయటపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ తన గురువన్న బండ్ల గణేష్.. కాంగ్రెస్ వల్లే ఈ దేశానికి మేలు జరుగుతుందని అన్నారు.

uttam

ఇక టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సైతం రాహూల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఎనలేని అభిమానమని భూపతిరెడ్డి ఈ సందర్బంగా చెప్పారు. తెలంగాణలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్న ఆయన.. ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా పనిచేయడంతో టీఆర్ ఎస్ సర్కార్ విఫలమయ్యిందని విమర్శించారు.  ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా  ఫెయిల్ అయ్యారని భూపతిరెడ్డి మండిపడ్డారు. 

tags: bandla ganesh, bandla ganesh joined in congress, producer bandla ganesh joined in congress, bandla ganesh meet rahul gandhi, bandla ganesh meet uttam, bandla ganesh joined congress in delhi

Related Post