బీజేపీతో ప్రజలు విసిగిపోయారు: రాహుల్ గాంధీ

news02 March 14, 2018, 6:14 p.m. political

 

ఉత్తరప్రదేశ్ లో  జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ విజయం సాధించింది. ఈ ఫలితాలపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... బీజేపీతో ప్రజలు విసిగిపోయారనే విషయం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోందని అన్నారు.. బీజేపీ ప్రభుత్వ పనీతీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రాహుల్ గాందీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం ఉన్న బీజేపీయేతర అభ్యర్థులకే ఓటర్లు పట్టంకట్టారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో  తమ పార్టీ పునర్మిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే ఇది రాత్రికి రాత్రే జరిగి పని కాదని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో కమలనాథులు ఇరుకునపడ్డట్లే. ఇదే అదనుగా మిత్రపక్షాలు, విపక్షాలు బీజేపీపై  విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

 

 

 

tags: rahul, congress, up, bypolls, results

Related Post