రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్ ఎమ్మెల్యేలు

news02 May 16, 2018, 5:50 p.m. political

karnataka governor hi tention
బెంగ‌ళూరు: క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి త‌మ ఎమ్మెల్యేల‌తో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్నాయి. దీంతో రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద హైడ్రామా చోటుచేసుకుంది. అయితే కాంగ్రెస్‌-జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా అనుమ‌తి నిరాక‌రించారు. ఎమ్మెల్యేలు ఎవ‌రూ రాజ్‌భ‌వ‌న్‌లోకి వెళ్ల‌కుండా రాజ్ భ‌వ‌న్ సిబ్బంది అడ్డుకున్నారు. 

karnataka governor

కాంగ్రెస్‌-జేడీఎస్ ఎమ్మెల్యేలు మాత్రం త‌మ‌కు సంఖ్య బ‌లం ఉన్నందున ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వాల‌ని రాజ్ భ‌వ‌న్ వ‌ద్దే ఉన్నారు. త‌మ ఎమ్మెల్యేల‌తో సంత‌కాలు చేయించి గ‌వ‌ర్న‌ర్‌కు అందించాల‌ని నిర్ణ‌యించారు. గ‌వర్నర్ అనుమ‌తి నిరాక‌రిస్తే అక్క‌డే త‌మ కూట‌మి ఎమ్మెల్యేల‌తో  ధ‌ర్నా చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. త‌మ‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకుంటే అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టుకు వెళ్లాల‌నే ఆలోచ‌నలో కాంగ్రెస్-జేడీఎస్ నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. 

Related Post