ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫ‌ర్‌

news02 May 16, 2018, 2:49 p.m. political

ka
బెంగ‌ళూరు: క‌ర్నాట‌క రాజ‌కీయాలు రంజుగా మారాయి. క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు అధికారం కోసం వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఒక‌వైపు అత్య‌ధిక స్థానాలు సాధించిన బీజేపీ అధికారాన్నికైవ‌సం చేసుకొవాల‌ని భావిస్తుండ‌గా.. త‌క్కువ సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ జేడీఎస్ తో జ‌త క‌ట్టి అధికారాన్ని చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇందుకోసం త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డంతో పాటు.. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేల‌కు గాలం వేస్తున్నాయి. డ‌బ్బు, ప‌ద‌వులు ఎర‌గా చూపి త‌మ వైపు లాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఫ‌లితంగా క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల‌కు భ‌లే డిమాండ్ ఏర్ప‌డింది. 

ka 2

క‌ర్నాట‌క‌లో ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ప‌లుకుతుంది. అధికారం జేడీఎస్‌-కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య దోబూచులాడుతుండ‌డంతో.. ఎమ్మెల్యేల‌ను ఎంత‌కైనా కొనుగోలు చేసేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. మ్యాజిక్ ఫిగ‌ర్‌కు కొద్దిలో దూరమైన బిజెపి ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చేందుకు రెడి అయిన‌ట్లు స‌మాచారం. జేడీఎస్‌-కాంగ్రెస్ నుంచి త‌మ వైపు వ‌స్తే డ‌బ్బుల‌తో పాటు మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బిజెపి సూటుకేసులు దింపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు బీజేపీయేత‌ర ఎమ్మెల్యేలు మిస్సైన‌ట్లు వార్త‌లోస్తున్నాయి.

ka 3

ఇటూ కాంగ్రెస్‌-జేడీఎస్ అగ్ర‌నేత‌లు కూడా కొంద‌రు బీజేపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెబుతుండ‌డం విశేషం. బీజేపీని కాద‌ని వారు త‌మ‌కే మ‌ద్ద‌తిస్తార‌ని అంటున్నారు. అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు అవ‌స‌ర‌మైన మెజార్టీ ఉండ‌డంతో పాటు... మ‌రికొంత మంది బీజేపీ ఎమ్మెల్యేల స‌పోర్టుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. 

ka 4

మొత్తంగా క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు జంప్ జిలానీల‌కు భ‌లే అవ‌కాశాన్ని ఇచ్చిన‌ట్లైంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరే వ‌ర‌కూ ఎంత మంది ఎక్క‌డ జంప్ అవుతార‌నేది ఇప్పుడే చెప్ప‌లేమంటున్నారు. 

tags: 100crores,bjp,congress,jds,karnataka hung

Related Post