డీజీపీని నివేధిక అడిగిన ఈసీ..

news02 Oct. 26, 2018, 7:55 p.m. political

uttam

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ప్రతి పక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేస్తూ.. వారిని భయబ్రాంతులు కలిగిస్తున్న తెలంగాణ సర్కార్ లోని కొంత మంది అధికారులపై పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలోని మహాకూటమి నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను కలిసి చేసిన పిర్యాదుకు స్పందన వస్తోంది. తమ ఫోన్లను ట్యాపింగ్ చేయడంతో పాటు.. నేతల వాహనాలను తనిఖీలపేరుతో ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మహాకూటమి పిర్యాదుతో ఎన్నికల సంఘంలో కదలిక వచ్చింది. 

ec

ఈ మేరకు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డిని నివేధిక కోరారు. ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తున్నారా.. ఒకవేల ట్యాప్ చేస్తే ఎవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని రజత్ కుమార్ డీజీపీని ఆదేశించారు. దీంతో పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైందని తెలుస్తోంది. తెలంగాణలో ప్రాధమిక హక్కులను కాలరాస్తూ వ్యక్తిగ స్వేఛ్చకు భంగం కలిగిస్తూ.. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మహాకూటమి నేతలు ఆరోపించిన నేపధ్యంలో.. ఇప్పుడు ఎన్నికల ప్రధానాధికారి పోలీస్ బాస్ ను నివేధిక కోరడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

tags: ec, election commission, ec about phone taping, rajath kumar about phone taping, ec asked report on phone taping, rajath kumar asked to dgp on phone taping

Related Post