కాళేశ్వ‌రం పేరుతో దోపిడి ..!

news02 May 15, 2018, 10:41 p.m. political

uttam kumar reddy

క‌రీంన‌గ‌ర్ : రాష్ట్రంలో కోట్లాదిమంది ప్రజలను .. మేధావుల ను మోసం చేస్తున్న ఒకేఒక్క వ్య‌క్తి కేసీఆర్ అని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. వేల కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతూ ప్రజలపై భారం మోపుతున్నాడని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో క‌లిసి తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించిన ఉత్త‌మ్ ..  కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలో నే అతి గొప్ప ప్రాజెక్ట్ అని గవర్నర్ .. జడ్జిలకు చెప్పి వారిని కాళేశ్వరనికి పిలిపించి శభాశ్ లు కొట్టిపించుకుంటున్నాడన్నారు. కాళేశ్వరం వెళ్లే ముందు ఒక్కసారి తుమ్మిటి హెట్టి ప్రాజెక్ట్ ను పరిశీలించాలని పొడ‌డ్త‌లు చేస్తున్న వారికి సూచించారు. 

uttam kumar reddy

కేసీఆర్ .. హ‌రీశ్ రావు ల‌కు కాళేశ్వరం వెళ్లి కాళేశ్వర్ రావ్ అని పేరు పెట్టిన గ‌వ‌ర్న‌ర్ నర్సింహ‌న్  తుమ్మిడీ హెట్టికి వచ్చి ఏం పేరు పెడతారో చెప్పాలన్నారు. 38 వేల కోట్లతో తక్కువ ఖర్చుతో గ్రావేటి తో పూర్తయ్యే తుమ్మిడి హెట్టిని వదిలేసి లక్ష కోట్లతో లిఫ్ట్ లతో పనిచేసే కాళేశ్వరం ఎందుకు కడుతున్నాడో కెసిఆర్ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని  ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక  కాళేశ్వరం ప్రాజెక్టును పోగుడుతున్న మీడియా సంస్థలు కూడా ఒక్కసారి దాని వెనక ఉన్న దోపిడీ గురించి ఆలోచించాలని ఉత్త‌మ్ సూచించారు. కేసీఆర్ కుట్ర పూరిత మనస్తత్వం, దోపిడీ, విధానాల తోని తుమ్మిడీ హెట్టి డిజైన్ పక్కన పెట్టి కాళేశ్వరాన్ని నెత్తిన పెట్టుకున్నాడని ద్వ‌జ‌మెత్తారు. 

uttam kumar reddy

నూట యాభై మీటర్ల ఎత్తులో చేపట్టే తుమ్మిడీ హెట్టి ప్రాజెక్ట్ వల్ల మహారాష్ట్ర లోని మూడు వేల ఎకరాలు మునుగుతాయని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని ఎత్తును148 మీటర్ల కు తగ్గిస్తున్నట్లు చెప్పడం వాస్తవం కాదా.. అదే148 మీటర్ల ఎత్తులో తుమ్మిడీ హేట్ఠి ని ఎందుకు నిర్మించలేదో చెప్పాల‌న్నారు. కమిషన్ల కోసమే శాశ్వతంగా గుది బండ గా మారే కాళేశ్వరం ప్రాజెక్టు కు ప్రజాధనాన్ని వెచ్చించ‌డం దుర్మార్ఘ‌మ‌న్నారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు గల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును38 కోట్లతో వైస్సార్ 2008 లో శంఖుస్థాపన చేస్తే, జాతీయ హోదా సాధిస్తామని చెప్పి నేడు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు ఆపేశార‌ని ఆయ‌న నిల‌దీశారు. జాతీయ హోదా కోసం తిరిగినప్పటికి తుమ్మిడీ హెట్టికి కమిషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించాడని ఆరోపించారు. మీడియాను మేనేజ్ చేస్తూ .. అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తుమ్మిడీ హెట్టి ప్రాజెక్టు కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అని నామకరణం చేస్తే అంబేద్కర్ పేరును ఎందుకు తొలగించాల్సివచ్చిందో చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశాడు . 

uttam kumar reddy

పక్క రాష్ట్రంలో మూడు వేల ఎకరాలు నష్ట పోతాయని సొంత రాష్ట్రంలో ని దళిత గిరిజన భూములను భూ సేకరణ పేరుతో లాక్కున్న చ‌రిత్ర కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ప్రాజెక్ట్ ల పేరుతో కేసీఆర్ కుటుంబం ధనవంతులు అవుతుంటే తెలంగాణ ప్రజల ఆస్తులు కరిగి పోతున్నాయని ఉత్త‌మ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రాజెక్టల రిడిజైనింగ్ పేరుతో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నిస్తే నన్నే జైల్లో పెడుతానంటున్న కేసీఆర్ ద‌మ్ముంటే ఆ ప‌ని చేయాల‌ని స‌వాల్ విసిరారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ..  అందులో జరుగుతున్న దోపిడీని మాత్ర‌మే ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు .

uttam kumar reddy

Related Post