దుబాయి అభివృద్దిలో భార‌త కార్మికుల శ్ర‌మ‌-చ‌మ‌ట ..!

news02 Jan. 11, 2019, 7:38 p.m. political

rahulgandhi

డిల్లీ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంట‌నే ఆంధ్రప్రదేశ్ కు స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం దుబాయ్ లో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ .. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిశారు. స్థానిక లేబర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేం చేసే మొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అని పున‌రుద్ఘాటించారు. గత సంవ‌త్స‌రం  మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్ మంతర్‌ వద్ద ధర్నా చేసిన అంశాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న .. మోడీ స‌ర్కారు నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని విమ‌ర్శించారు . రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని మరిచారన్నారు. 

rahulgandhi

దుబాయ్ లోని భారత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ .. దుబాయ్‌ అభివృద్ధిలో భారత కార్మికుల పాత్ర చాలా కీల‌కంగా ఉంద‌న్నారు.  ఇక్కడి ఎత్తైన భవనాలు .. పెద్ద మెట్రో స్టేషన్లు .. విమానాశ్రయాలు .. రోడ్లల్లో మీ శ్రమ .. చెమట ఉంద‌న్నారు . మీరు లేకుండా ఇదంతా ఇక్కడ సాధ్యమయ్యేది కాదన్నారు. భారత కార్మికుల వల్లే ఈ రోజు దుబాయ్‌ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక నగరంగా ఉందన్నారు . అంతేకాక పేదరికంలో ఉన్న మీ కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాన‌ని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. 

rahulgandhi

tags: Rahul Gandhi DubaiTour,aicc,andra pradesh,apcm,apcc,apbjp,ysrcp,modi,pm,dubai,chandrababu,ap special status,soniyagandhi,telangana

Related Post