కేసీఆర్ హామీపై కాంగ్రెస్ సూటి ప్రశ్న ..!

news02 July 5, 2019, 9:48 a.m. political

AMBEDKAR STATUE

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేశారు. అందులో చాలావరకు గాలికొదిలేశారు. 2016 ఏప్రిల్ నెలలో రాజ్యాంగ నిర్మాత, దళిత జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగరంలో ప్రతిష్టించాలని కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. ఏకంగా 125 అడుగుల ఎతైన అంబేద్కర్ విగ్రహం నిర్మించడంతో పాటు అంబేద్కర్ భవనాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

AMBEDKAR STATUE

ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎతైనదిగా ఉండబోతోందని కేసీఆర్ గొప్పలు చెప్పారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 36 ఎకరాల్లో రెండెకరాల్లో అంబేద్కర్ విగ్రహం .. మ్యూజియం .. సమావేశమందిరం నిర్మాణం చేస్తామన్నారు. మిగిలిన 34 ఎకరాల్లో అంబేద్కర్ స్క్వేర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హామీ ఇచ్చి మూడేళ్ళు ముగిసి పోయింది. ఇప్పటివరకూ ఈ విగ్రహం ఏర్పాటుకు అతీగతీ లేదు. . ఈవిగ్రహం ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

AMBEDKAR STATUE

ఈ విగ్రహం పెట్టకపోగా .. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, చెత్తకుండీలో పడేయడం వివాదాస్పదం అయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఆందోళనకు కూడా దిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇష్యుపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రేడ్ సీనియర్. నేత వీహెచ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దళితుడిని సీఎం చేస్తానని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేస్తానని దగా చేసిన సీఎం తీరుపై హస్తం నేతలు మండిపడుతున్నారు. దళితులను దగా చేసిన సీఎం కేసీఆర్ ని ప్రజలు నిలదీసే సమయం దగ్గరలోనే ఉందని .. ఇప్పటికైనా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వెంటనే నిర్మించాలంటున్నారు కాంగ్రెస్ నేతలు.

AMBEDKAR STATUE

tags: AMBEDKAR STATUE,KCR,UTTAM KUMAR REDDY, REVANTH REDDY,VH,MANDAKRISHNA MADIGA, AMBEDKAR STATUE AT PANJAGUTTA, GANDHIBHAVAN,TRS BHAVAN, TELANGANA,KCR GOVT,BJP,LAXMAN,KISHAN REDDY,CONGRESS,KODANDARAM

Related Post