119 స్థానాల్లో పోటీ .. 80 సీట్లు గెలుపు ఖాయం ..!

news02 May 17, 2018, 9:59 p.m. political

uttam kumar reddy

బెల్లంప‌ల్లి : కేసీఆర్  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అటకెక్కించిందని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ద్వ‌జ‌మెత్తారు. ఆదివాసీల సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆయ‌న ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు ఖాయమన్న కాంగ్రెస్ ర‌థ‌సార‌థి .. అధికారంలో రాగానే పోడుభూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలందిస్తామని హామీ ఇచ్చారు . జనాభా ప్రకారం గిరిజనుల కు రిజర్వేషన్‌ అమలు చేస్తామని .. అభయహస్తం పునఃరుద్ధరిస్తామని చెప్పారు . 

uttam kumar reddy

వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్ద పిఠ వేస్తామ‌న్న ఉత్త‌మ్ .. పత్తి .. కందుకలు .. వరి దాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ రేటు కంటే అదనంగా రాష్ట్రప్ర‌భుత్వం నుంచి ఇచ్చి ఆదుకుంటామ‌న్నారు. పత్తి కి మద్దతు ధర 6 వేల కు తగ్గకుండా  .. వరికి కందులకు మరో రెండు వేయి లు అదనంగా ఇచ్చి కొనుగోళ్లు చేసి అండగా నిలుస్తామ‌న్నారు. ప్రజా చైతన్య యాత్రలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతూ తాము నిర్వ‌హిస్తున్న బస్ యాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయ‌న తెలిపారు.

uttam kumar reddy

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమ‌న్న ఉత్త‌మ్ ... మంచిర్యాల , బెల్లంపల్లి లోని సింగరేణి కార్మికుల అండ‌తో టీఆర్ఎస్ పార్టీ కి ఇంటికి సాగ‌నంపుతామ‌న్నారు . తాము అధికారంలోకి రాగానే బెల్లంపల్లి లో మెడికల్ కాలేజీ నిర్మిస్తామ‌ని ఉత్త‌మ్ హామీ ఇచ్చారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామ‌ని చెప్పారు. సింగరేణీ కారికుల సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తామ‌న్నారు. సింగరేణి కాలరీస్ లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తామ‌ని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పర్మినెంట్ చేస్తామ‌ని ఉత్త‌మ్ హామీ ఇచ్చారు. డిస్మిస్ కార్మికులను మానవత్వం తో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామ‌న్నారు. 

uttam kumar reddy

సింగరేణిలో.ఓపెన్ కాస్ట్ లను రద్దు చేస్తామని చెప్పిన కేసీఆర్ కొత్త ఓపెన్ కాస్ట్ లను తెరుస్తున్నాడని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్  ప్రభుత్వం లో రైతులు ... గిరిజనులు ... నిరుద్యోగులు ... మహిళలు ... ఒక్కరేంటి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మోసపోయారని ఉత్త‌మ్ ఫైర్ అయ్యారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో 119 నియోజక వర్గాల్లో   పోటీ చేస్తామ‌ని ఉత్త‌మ్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుంద‌న్న ఆయ‌న ఆ మేర‌కే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌న్నారు.

uttam kumar reddy

ఇక కర్ణాటకలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై స్పందించిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ..కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హత ఉన్నా ప్రదాని నరేంద్ర మోడీ .. బీజేపీ అద్యక్షుడు అమిత్ షా కలిసి గ‌వ‌ర్న‌ర్ తో రాజ్యాంగాన్ని కూనీ చేయించార‌ని ఆయ‌న ద్వ‌జ‌మెత్తారు. ఈ ఇష్యూలో కర్ణాటక గవర్నర్ వ్య‌వ‌హ‌రించిన తీరు దేశ చ‌రిత్ర‌లో ఓ చీకటి రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ అప్ర‌జాస్వామిక నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేర‌కు శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామ‌న్నారు . ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దెత్తున పాల్గొనాలి విజ‌య‌వంతం చేయాల‌ని ఉత్త‌మ్ పిలుపు నిచ్చారు. 

congress bus yathra

Related Post