కేసీఆర్ తాటాకు చ‌ప్పుళ్ళ‌కు భ‌య‌ప‌డ‌ను ..!

news02 May 16, 2018, 12:11 p.m. political

congress bus yathra

సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఎత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతున్న త‌న‌ను బెదిరించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కేసీఆర్ తాటాకు చ‌ప్పుళ్ళ‌కు తాను భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చిచెప్పారు. త‌న‌పై లేనిపోని ఆరోప‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేసేప్ర‌య‌త్నాలు టిఆర్ఎస్ చేస్తోంద‌ని ఉత్త‌మ్ అన్నారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో జరిగిన భారీ బహిరంగసభలో ఉత్తమ్‌ ప్రసంగిస్తూ.. ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా, ఎంతగా బెదిరింపులకు పాల్పడినా తాను మాత్రం ప్రజాపక్షమే నిలబడి టీఆర్ఎస్‌ చేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను, ప్రజాధనాన్ని దోపిడీలను బట్టబయలు చేస్తాననిఅన్నారు. 

congress bus yathra

తాను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ యుద్ధ విమానాలకు పైలట్‌గా చేసి దేశం కోసం పనిచేశానని, చైనా, పాకిస్తాన్‌ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు త్యగించి విధులు నిర్వహించానని ఉత్తమ్‌ గుర్తు చేసుకున్నారు. తాను హుజూర్ న‌గర్‌ ఎమ్మెల్యేగా .. తన భార్య పద్మావతిరెడ్డి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నామని .. తమకు పిల్లలు కూడా లేరని ..  ప్రజలంతా తమ పిల్లలేనని ..  వారి కోసం ..  కాంగ్రెస్‌ పార్టీ కోసం తమ జీవితాలను అంకితం చేశామని చెప్పారు. దేశభద్రత కోసం పైలెట్‌గా పనిచేసినప్పుడు కూడా తాను ప్రాణభయంతో ఏనాడూ లేనని ..ఇప్పుడు కేసీఆర్‌ బెదిరింపులకు భ‌య‌ప‌డుతాన‌నుకుంటే బ్ర‌మేన‌ని ఆయ‌న కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. 

congress bus yathra

సిర్పూర్‌ పేపర్‌ మిల్‌ మూసివేత నిరోధించడంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్‌ విమర్శించారు. మూతపడిన పరిశ్రమలన్నింటినీ తిరిగి తెరిపిస్తామని ఎన్నికల ముందు కేసీఆర్‌ హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ పరిశ్రమల మంత్రిగా మూత పడిన పరిశ్రమల్ని తెరిపించలేకపోయారని .. ఉన్న పరిశ్రమలు సమర్ధంగా పనిచేసేలా చేయడంలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ సూటు బూటు వేసుకుని దేశవిదేశాలు పర్యటించడంలో ముందున్నారని, కానీ సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోని పేపర్‌ మిల్లు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించడంలో తీవ్ర వైఫల్యం చెందారని ఉత్తమ్‌ మండిపడ్డారు.

congress bus yathra

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అధికారపగ్గాలు అందుబోతోందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే సిర్పూర్‌ పేపర్‌ మిల్స్, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ, ఇతర సిక్‌ యూనిట్లను తెరిపిస్తామ‌న్నారు. వీటి వల్ల లక్షలాది ఉద్యోగ కల్పన జరుగుతుందని, నిరుద్యోగులకు ప్రతి నెలా మూడు వేలను నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. రైతులకు, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. పాత ఆదిలాబాద్‌ జిల్లాకు పూర్తి న్యాయం చేస్తామని, నీటి వనరులు జిల్లాకు వచ్చేలా చేసి భూములు సాగు అయ్యేలా చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి వేల కోట్ల రూపాయల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. 

congress bus yathra

Related Post