ఇది కేసీఆర్ డ్రామానా..? పవన్ నటన నా..?

news02 Jan. 27, 2019, 6:25 a.m. political

Pawan Kalyan met cm kcr and ktr

 

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.

Pawan Kalyan met cm kcr and ktr

ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని సీఎం కేసీఆర్‌ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు పవన్‌ కల్యాణ్ సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చాలాసేపు మాట్లాడటం చర్చనీయాంశమైంది.

Pawan Kalyan met cm kcr and ktr

పవన్‌ కల్యాణ్‌‌ వారిద్దరితో ఏం మాట్లాడి ఉంటారనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

tags: Pawan Kalyan met kcr, Pawan Kalyan met Ktr , Pawan Kalyan new images Pawan Kalyan phone numbers, Pawan Kalyan wife, Pawan Kalyan family, janasena office, janasena chief, janasena party, Chandra Abu, kcr met governor , Ktr met governor, Republic Day, governor at-home, rajbhavan road.

Related Post