టీఆర్ ఎస్ కు ఓటేస్తే ప్రజల జీవితాలు నాశనం

news02 Dec. 3, 2018, 7:14 p.m. political

vijayashanti

సీఎం కేసీఆర్ కు తెలంగాణను పరిపాలించడం చేతకాదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ గద్దె దిగడం ఖాయమన్న విజయశాంతి.. కేసీఆర్‌కు రాములమ్మ చెబుతోన్న జాతకమిదేనని తనదైనస్టైల్లో చెప్పారు. ఇకపై తెలంగాణ తలరాత మారబోతోందని, నాడు ప్రజలకు ఇచ్చిన హామీలేంటీ.. నేడు చేస్తోన్న మోసమేంటని సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు విజయ శాంతి. 

vijayashanti

గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని టీఆర్ ఎస్ ను గద్దె దింపాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటిమెంట్‌, అధికారంలోకి వచ్చాక సెటిల్‌మెంట్‌, తెలంగాణా ద్రోహులకు మంత్రివర్గంలో ప్లేస్‌మెంట్‌.. ఇదేంటని అడిగితే తమకు పనిష్మెంట్‌.. అంటూ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోసారి టీఆర్ ఎస్ కు ఓటేస్తే ప్రజల జీవితాలు నాశనమవుతాయని విజయశాంతి హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయశాంతి వివరించారు. ప్రజాకూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిపుపునిచ్చారు.

 

tags: vijayashanti, vijayashanti fire on kcr, vijayashanti fire on cm kcr, vijayashanti fire on trs, vijayashanti road show

Related Post