ప్ర‌మాణ స్వీకారం చేసిన 21 మంది మంత్రులు

news02 June 6, 2018, 4:24 p.m. political

karnataka new cabinet

బెంగ‌ళూరు: క‌ర్నాట‌క‌లో కొత్త క్యాబినెట్ కొలువుతీరింది. సీఎంగా హె.డీ కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రెండు వారాల‌కు మంత్రి వ‌ర్గ కూర్పుపై కాంగ్రెస్‌-జేడీఎస్ మ‌ధ్య స్ప‌ష్ట‌త రావ‌డంతో... బుధ‌వారం 21 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి 14 మంది ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గా.. జేడీఎస్ నుంచి 7గురు ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరంద‌రి చేత గ‌వ‌ర్నర్ వాజు భాయ్ వాలా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అయితే కీల‌క మంత్రి ప‌ద‌వులైన హోం శాఖ కాంగ్రెస్‌కు ద‌క్క‌గా.. ఆర్థిక శాఖ జేడీఎస్‌కు ద‌క్కింది. అలాగే బీఎస్పీ, కేజీపీ పార్టీ ఎమ్మెల్యేల‌కు చెరో మంత్రి ప‌ద‌వి ల‌భించింది. 

karnataka new cabinet 2

నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ర్నాట‌క మంత్రుల సంఖ్య 34కు మించ‌రాదు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప‌ర‌మేశ్వ‌ర్ కూడా ప్ర‌మాణం స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే రెండు పార్టీలు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఇంత‌కు ముందే ఓక్లారిటీకి వ‌చ్చినందున కాంగ్రెస్‌-జేడీఎస్ 2:1 నిష్ప‌త్తిలో ప‌ద‌వుల‌ను పంచుకున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 22 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం కేబినెట్‌లో మ‌రో 12 బెర్త్‌ల‌కు అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

మంత్రి ప‌ద‌వులు పొందిన వారు వీరే....
కాంగ్రెస్ నుంచి ప‌ద‌వులు పొందిన వారు...
1. డీకే శివకుమార్‌. 2.ఆర్‌ వీ దేశ్‌పాండే. 3.హెచ్‌కే పాటిల్‌. 4.శమనూరు శివశంకరప్ప. 5.కేజే జార్జ్‌. 6.కృష్ణ బైర్‌ గౌడ. 7.రాజశేఖర్‌ పాటిల్‌. 8.ప్రియాంక ఖర్గే. 9.శివానంద్‌ పాటిల్‌. 10.యూటీ ఖడార్‌. 11.జమైర్‌ అహ్మద్‌ ఖాన్‌. 12.పుట్టరంగ శెట్టి. 13.శివశంకర రెడ్డి. 14.జయమాల. 
జేడీఎస్ నుంచి ప‌ద‌వులు పొందిన వారు... 1.హెచ్‌డీ రేవన్న. 2.జీటీ దేవెగౌడ. 3.బండప్ప కశంపుర్‌. 4.సీఎస్‌ పుట్టరాజు. 5.వెంకటరావ్‌ నాదగౌడ. 6.హెచ్‌కే కుమారస్వామి. 7.ఎస్‌ఏ ఆర్ఏ మహేశ్‌.

tags: karnataka new cabinet,kumarswamy cabinet,jds,congress,bjp,governor vagubha vala,karnataka new cabinet,karnataka new cabinet minister list,karnataka new cabinet minister,karnataka new cabinet list,karnataka new cabinet ministers list,karnataka new cabinet ministers names,karnataka new cabinet ministers,karnataka new cabinet ministers list 2016,karnataka government new cabinet,karnataka new congress cabinet ministers list,karnataka cabinet reshuffle new ministers,karnataka government new cabinet ministers,new cabinet in karnataka,new ministers in karnataka cabinet,new ministers in karnataka cabinet 2016,new cabinet minister in karnataka,new cabinet ministers of karnataka 2016,karnataka new cabinet ministers list with portfolio,karnataka state new cabinet ministers list,karnataka state new cabinet ministers,new cabinet of karnataka,new cabinet ministers of karnataka,new cabinet minister of karnataka new cabinet minister of karnataka 2013,new cabinet ministers of karnataka government,new c

Related Post