టీఆర్ ఎస్ ను ఓడించేంది ఒక్క కాంగ్రెస్సే

news02 June 3, 2019, 6:46 a.m. political

uttam

 

సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ లు పోరాటం చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గాంధీభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యమంలో మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 60 ఎళ్లలో 69వేల కోట్లు అప్పు అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  2లక్షల 60 వేల కోట్ల  అప్పు అయ్యిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా అన్నారు. ఐతే దానికి తగ్గ అభివృద్ధి మాత్రం తెలంగాణలో జరగలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని ఉత్తమ్ మండిపడ్డారు. 

uttam
ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయిన నిరుద్యోగ భృతి విధి విధానాలు రూపొందించలేదని ఆయన మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీలో నమోదు చేసుకున్న వారే 12లక్షల నిరుద్యోగులున్నారని ఉత్తమ్ చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన రంగాలను ప్రభుత్వం అణిచి వేస్తుందన్న ఉత్తమ్.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల్లో కంటే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. బీజేపీ లక్కీగా నాలుగు సీట్లు గెలిచిందన్న ఉత్తమ్.. తెలంగాణ లో  టీఆర్ ఎస్ ను ఓడించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని చెప్పారు.
 

tags: telangana, telangana 6th anniversary, telangana celebrations, uttam in telangana celebrations, uttam participated in telangana celebrations, telangana celebrations in gandhibhavan

Related Post