ముందస్తు ఎన్నికలపై లగడపాటి సర్వే

news02 Sept. 12, 2018, 3:49 p.m. political

uttam

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్న జనానికి నిరాశే ఎదురైంది. 2014 ఎన్నికల సందర్బంగా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమర వీరుల కుటుంబాల నుంచి మొదలు ఉద్యోగులకు, నిరుద్యోగులు, రైతులు, విధ్యార్ధులు, ముస్లింలు, బడుగు బలహీనవర్గాలు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో మరో ఎనిమిది నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేయడంపైనా కేసీఆర్ పై జనం మండిపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడే తమకు అన్ని సంక్షేమ పధకాలు అంది.. రాష్ట్రం అభివృద్ది చెందిందని సామాన్యులు చెబుతున్నారు.

lagadapati

ఇదిగో ఇప్పుడు తెలంగాణలో జనం ఆశ నెరవేరబోతోంది. అదేనండి ప్రజలు కోరుకుంటున్నట్లే మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. అవును లగడపాటి రాజగోపాల్ గత వారం రోజులుగా తెలంగాణలో చేయించిన సర్వే నివేధికను బయటపెట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని లగడపాటి సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 61 సీట్లు వస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వేలో స్పష్టమైంది. 61సీట్ల గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలో తెటతెల్లమైంది.

survey

ఇక వందసీట్లు వస్తాయని గొప్పలు చెబుతున్న టీఆర్ ఎస్ కు కేవలం 39 సీట్లు మాత్రమే వస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వేలో తేలింది. దీంతో కేసీఆర్ సహా.. టీఆర్ ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని లగడపాటి సర్వేలో వెల్లడైందట. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ప్రజలు వాపోతున్నారట. అందుకే ఈ సారి టీఆర్ ఎస్ కు ఓటు వేసేందుకు మెజార్టీ ఓటర్లు సిద్దంగా లేరని సర్వేలో తేలింది. లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలతో కేసీఆర్ తో పాటు టీఆర్ ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే గతంలో లగడపాటి సర్వే ఫలితాలు ఎప్పుడు విఫలమవ్వలేదు. 

uttam

2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని లగడపాటి వెల్లడించిన సర్వేలు నిజమయ్యాయి. ఇక మొన్న కర్ణాటకలోను జేడీఎస్ కీలమవుతుందని లగడపాటి చెప్పిన సర్వే నివేధిక అక్షరాలా నిజమైంది. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల విషయంలోను లగడపాటి సర్వే ఫలితాలు అచ్చుగుద్దినట్లు నిజమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక లగడపాటి సర్వేలో కాంగ్రెస్ కు 61 సీట్లు రాగా, టీఆర్ ఎస్ కు 39, ఎంఐఎం కు 7, టీడీపీకి 3, వీజేపీకి 3, సీపీఐకి 2, సీపీఎంకు 1, ఇతరులకు 3సీట్లు వస్తాయని తేలింది. ఇక తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేలడంతో అప్పుడే టీఆర్ ఎస్ నేతలు డీలాపడిపోయారు. 
 

tags: lagadapati, lagadapati survey, lagadapati survey on ts poll, lagadapati survey on telangana election, lagadapati rajagopal survey on rs poll, lagadapati survey report, lagadapati survey report on ts pre poll

Related Post