బెడిసికొట్టిన రాజగోపాల్ రెడ్డి వ్యూహం .. !

news02 July 9, 2019, 9:38 a.m. political

Rajagopal reddy

హైదరాబాద్ : ఎలాగైనా బీజేపీలో చేరాలని ఉబలాటపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీళ్ళు చల్లింది బీజేపీ హైకమాండ్. బిజెపిలో చేరాలనే ఆయన ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. తాము స్పష్టత ఇచ్చే వరకు వెయిట్ చెయ్యమని బిజెపి అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సూచించడంతో ఆయన షాక్ తిన్నారు. దీనికి కారణం లేకపోలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆయన చేరికకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మాటను కాదని బీజేపీ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. 

Rajagopal reddy

కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అభిప్రాయం తీసుకున్న అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బిజెపిలోకి వెళ్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయం బయటకు వచ్చింది.  బీజేపీలో ఎంతోమంది ఉంటే.. ఇంకా పార్టీలోకి రాకుండానే సీఎం కుర్చీపై ఆశ పడడం కోమటిరెడ్డికి మైనస్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై బిజెపి రాష్ట్ర నాయకులు తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఆయన పార్టీ మార్పుపై అనుచరులతో పెట్టుకున్న సమావేశంలో క్యాడర్ మేము నీవెంట రామంటూ చెప్పడం .. ఆ మీటింగ్ ఫెయిల్ కావడం లాంటి అంశాలను కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ పంపినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ దూకుడు పార్టీకి నష్టం చేస్తుందని వారు అధిష్టానం దృష్టికి తెచ్చారట.

Rajagopal reddy

దీనికి తోడు .. రాజగోపాల్ రెడ్డి డిమాండ్లు కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. పార్టీ పగ్గాలను తన చేతికి ఇవ్వాలని ఆయన బిజెపి హైకమాండ్ ను కోరారని తెలుస్తోంది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి దూకుడు బీజేపీకి మింగుడుపడడం లేదు. సీనియర్ నేతలను కాదని రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం పార్టీ భవిష్యత్తుకి చేటు తెస్తుందని భావిస్తున్నారు.

tags: KOMATIREDDY RAJAGOPAL REDDY, KOMATIREDDY BROTHERS, KOMATIREDDY RAJAGOPAL REDDY GOING TO JOIN BJP,STATE BJP LEADERS, KISHANREDDY, LAXMAN, DATTATREYA,MODI, AMITH SHA,TPCC,UTTAM KUMAR REDDY, REVANTH REDDY, GANDHIBHAVAN,KCR,CM

Related Post