11 ఏళ్ల ద‌ర్యాప్తు శూన్యం

news02 April 16, 2018, 1:29 p.m. political

సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగిన మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసును నాంప‌ల్లి  ఎన్ఐఎ కోర్టు కొట్టివేసింది. నిందితుల‌పై నేరారోప‌ణ నిరూపించ‌డంలో ప్రాసిక్కూష‌న్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వెల్ల‌డించింది. చార్జిషీట్‌లో దాఖ‌లు చేసిన సాక్ష్యాధారాలు స‌రిపోనందున ఈరోజు 5గురు నిందితుల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ తీర్పు వెల్ల‌డించింది. 2007 మే 18న మ‌సీదులో పేలుళ్లు సంభ‌వించాయి. అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈకేసును సీబీఐ, ఎన్ఐఎకు అప్ప‌గించింది. అయితే 11 ఏళ్ల పాటు ద‌ర్యాప్తు కొన‌సాగించిన కేంద్ర ద‌ర్యాప్తు బృందాలు... దోషులకు శిక్ష ప‌డ‌డంలో పూర్తిగా విఫ‌లం చెందాయ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. 

tags: makka,majud,blasts,nia,cbi,court,nampally court, old city,pata basti

Related Post