గుడ్లగూబల కోసం తెలంగాణ నాయకుడు

news02 Dec. 6, 2018, 8:39 a.m. political

owl

తెలంగాణ ఎననికల కోసం తెస్తున్న గుడ్లగూబను కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. అదేంటీ ఎన్నికల కోసం గుడ్లగూబను తేవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే మీకు అసలు కధ చెప్పాల్సిందే.. విషయం ఎంటంటే.. కర్ణాటక రాష్ట్రంలోని సేడం లో మొన్న ఇద్దరు వేటగాళ్లు రెండు గుడ్లగూబలను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులుకు పట్టబడ్డారు. ఇక సదరు వేటగాళ్లను విచారించగా.. ఆశ్చర్యకరమైన అంశాలు బ.యటకు వచ్చాయి. ఈ రెండు గుడ్లగూబలను తెలంగాణ ఎన్నికల కోసం తరలిస్తున్నామని వారు చెప్పారట. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ నాయకుడు ఈ గుడ్లగూబలను వేటాడి తెమ్మని వేటగాళ్లను పరమాయించాడట. ఇక ఈ గుడ్లగూబలను తమ ప్రత్యర్ధిగా పోటీ చేస్తున్న అభ్యర్ధికి కీడు జరిగేలా క్షద్రపూజలు చేసి.. దాన్ని బలిస్తారట. వేటగాళ్లు చెప్పిన విషయలు విన్న పోలీసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఐతే ఈ గుడ్లగూబలను తెమ్మని చెప్పిన తెలంగాణ నాయకుడు ఎవరన్నది మాత్రం పోలీసులు చెప్పలేదు. 

tags: owl, police seazed owl, telangana political leader want owl, telangana leader want owl, karnataka police seazed owl

Related Post