మోడీ, అద్వానీ మధ్య రాహుల్ గాంధీ

news02 March 11, 2018, 2:27 p.m. political

Rahul gandhi with pm modi

ఒక్కొక్క ఫోటో ఎన్నో అర్థాలను చెబుతుంది. ఒక్కటే ఫోటో అన్ని భావాలను పలకరిస్తుంది. ఇవన్నీ కలిపివున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో సంచలనం అయ్యింది. ఈ మధ్యనే త్రిపురలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఎల్కే అద్వానీని పీఎం మోడీ అవమాననించిన సంగతి తెలిసిందే.. ఎల్కే అద్వానీ రెండు చేతులెత్తి నమస్కారం పెట్టినా మోదీ ప్రతినమస్కారం పెట్టలేదు. అయితే ఇప్పుడు వైరల్ అయిన ఫోటో మోడీ సంస్కారానికి కౌంటర్ గా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎల్కే అద్వాని, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిసున్న ఫోటో ఇది. ఎల్కే అడ్వాణీని రాహుల్ ఓదార్చుతున్నట్లు కనిపిస్తుంది. అడ్వాణీని గౌరవించాలని ఆయనను చూపిస్తూ రాహుల్.. మోడీకి చెబుతున్నట్లు ఉంది. అడ్వాణీకి , మోడీ కి మధ్య రాహుల్ సయోధ్య కుదిరిస్తున్నట్లు కనిపిస్తోంది. వీరి మధ్య సుష్మాస్వరాజ్ కూడా ఉంది. అమేకూడా ఎల్కే అద్వాని గురించి మోడీ కి చెబుతున్నట్లు ఉంది. అయితే ఈఫోటో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంలోనిది.

tags: Rahul gandhi, pm Modi, sushma swaraj, vairal photo, social media, theenmar.

Related Post