కేసీఆర్ కు కొండా భహిరంగ లేఖ..

news02 Sept. 25, 2018, 1:38 p.m. political

konda

ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి.. టీఆర్ ఎస్ నాయకురాలు కొండా సురేఖ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని ఆమె విమర్శించారు. ఈ మేరకు కేసీఆర్ కు కొండా సురేఖ భహిరంగ లేఖ రాశారు. ఈ క్రమంలో కేసీఆర్, ఆయన కుటుంబంపై ఆమె పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు టీఆర్ ఎస్ లో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వలేదని సురేఖ మండిపడ్డారు. బీసీ మహిళ అయిన తనకు టీార్ ఎస్ లో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పిన ఆమె.. ఐనా తనకు ఎమ్మెల్యే సీటు కెటాయించకపోవడం అన్యాయమని అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం దారుణమని అన్నారు కొండా సురేఖ. మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడపడంలోనే మహిళలపై కేసీఆర్‌కు ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ఇక టీఆర్ ఎస్  ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్న సురేఖ... షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. కేవలం ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు తెరతీశారని విమర్శించారు. టీఆర్ స్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం చాలా బాధించిందని చెప్పిన సురేఖ.. దీనిపై రెండ్రోజుల్లో సమాధానం చెప్పాలని అధిష్ఠానాన్ని కోరినా ఫలితం లేకపోయిందని చెప్పారు. 

konda

అందుకే కేసీఆర్‌ కు బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పిన కొండా సురేఖ.. కేసీఆర్‌ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఆయన కుటుంబానికి మాత్రం నాలుగు పదవులు ఇచ్చుకున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిని కలవాలంటే సాధారణ ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకూ కష్టమేనని చెప్పిన సురేఖ.. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ఎప్పుడు ప్రయత్నించినా నిరాశే ఎదురయ్యిందని ఆవేధన వ్యక్తం చేశారు. తన తండ్రి చనిపోతే ఓదార్చడానికి రాని కేసీఆర్‌... తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు తండ్రి చనిపోతే మాత్రం వరంగల్‌ వచ్చి పరామర్శించి వెళ్లారని మండిపడ్డారు. బీసీ మహిళను కాబట్టే తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపించిన సురేఖ... తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న కేసీఆర్‌.. తనకు టాబ్లెట్లు ఇచ్చేందుకు నియమించుకున్న వ్యక్తిని మాత్రం ఏకంగా రాజ్యసభకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆమె దెయ్యమంటూ అవహేళన చేయడం దారుణమని కొండా సురేఖ విమర్శించారు. 

konda

నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇక కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని కొండా సురేఖ ఆరోపించారు. అందుకే హరీశ్‌రావు నమ్మకస్తులకు టిక్కెట్లు కేటాయించలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అమెరికా నుంచి వచ్చిన కవిత నెల రోజులు ఉండి వెళ్లిపోతానని చెప్పి వ్యాపారిగా మారిందని విమర్శించిన సురేఖ... లష్కర్‌ బోనాల్లో కవిత ఏ ప్రొటోకాల్‌ ప్రకారం బంగారు బోనం ఎత్తుకుందని ప్రశ్నించారు. కవిత బంగారు బోనం ఎత్తుకోవడమే బంగారు తెలంగాణనా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నయీం కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసిన సురేఖ... ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కాంగ్రెస్‌లో ఉంటే తప్పలేదు గానీ.. డీఎస్‌ కుమారుడు భాజపాలో చేరితే విమర్శిస్తారా అని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌ అందుకు సిద్దం కావాలని సవాల్ విసిరిన కొండా సురేఖ... వచ్చే ఎన్నికల్లో మహాకూటమి చేతిలో టీఆర్ ఎస్ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు.

tags: konda fire on kcr, konda surekha fire on kcr, konda surekha fire on trs, konda surekha fire on ktr, konda surekha fire on kavitha, konda surekha fire on kcr family, konda surekha fire on trs leaders, konda surekha open letter to kcr

Related Post