శ్రీ‌రెడ్డితో టీఆర్ ఎస్ ఎంపీ.

news02 April 14, 2018, 3:07 p.m. political

srireddy

సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న క్యాస్టింగ్ కౌచింగ్ వ్య‌వ‌హారంతో ఇండ‌స్ట్రీ దుమ్ము దులిపిన‌ సినీ న‌టి శ్రీ‌రెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర తీయ‌నునున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు, నేప‌థ్యంతో సినిమాలు వ‌చ్చిన విష‌యం తెల్సిందే. అయితే తెర మీద ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ప‌లువురు న‌టులు.. తెర వెనుక వారి చేసిన బాగోతాల‌ను బ‌హిర్గ‌తం చేసి శ్రీ‌రెడ్డి అందరినీ ఆక‌ర్షించింది. అస‌లు సినీ ప‌రిశ్ర‌మ‌లో  కింది స్థాయి మ‌హిళా ఆర్టిస్టుల‌పై జ‌రుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన ఆరోప‌ణ‌లు, వ‌రుస లీకులు, ఆధారాల‌తో  సినీ ఇండ‌స్ట్రీ ప‌రువు కాస్తా బ‌జారున ప‌డిన‌ట్లైంది. కో-డైరెక్ట‌ర్లు, ప్రోడ్యూస‌ర్స్, వారి పిల్ల‌లు, మేనేజ‌ర్లు, కో-ఆర్డీనేట‌ర్ల దోపిడీ, జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై వేధింపులు జ‌రిగిన‌ట్లు ప‌లు ఆధారాలు చూప‌డంతో ఇండ్ర‌స్ట్రీ ప‌రువు పోయిన‌ట్లైంది. 

 mp keshava rao with sri reddy
అయితే ఇంత పెద్ద ఎత్తున సినీ ఇండ్ర‌స్ట్రీ స‌మ‌స్య‌లు బ‌హిర్గ‌తం కావ‌డంతో.. అస‌లు ఇండ్ర‌స్ట్రీలో ఏం జ‌రుగుతుంద‌నే అంశంపైనే సినిమా తీయాల‌ని టీఆర్ ఎస్‌ ఎంపీ కె.కేశ‌వ‌రావు నిర్ణ‌యానికి వ‌చ్చినట్లు స‌మాచారం. క్యాస్టింగ్ కౌచ్ తో పాటు కో-ఆర్డినేట‌ర్లు, మేనేజ‌ర్ల దోపిడిపై సినిమా తీయాల‌ని భావించిన‌ట్లు తెలుస్తోంది. అందుకోసం సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన అరాచకాల‌ను బ‌హిర్గ‌తం చేసిన శ్రీ‌రెడ్డిని క‌థ నాయికిగా ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. శ్రీ‌రెడ్డితో సినిమా తీసేందుకు టీఆర్ ఎస్ ఎంపీ కె.కేశ‌వ‌రావు ఇప్ప‌టికే ఆమెతో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న అన్యాయాల‌పై సినిమా తీసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. 

srireddy
ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లు ర‌కాల క‌థ నేప‌థ్య‌ల‌తో సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా తెరాస ఎంపీ కె.కేశ‌వ‌రావు సినీ ఇండ్ర‌స్ట్రీ అంశాల దృష్ట్యా సినిమా తీసేందుకు ముందుకు రావ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. కేశ‌వ‌రావు, శ్రీ‌రెడ్డి కాంబినేష‌న్‌లో రాబోయే సినిమా... అదీ సినిమా ప‌రిశ్ర‌మ మీదా నిర్మాణం కాబోతున్న మూవీ ఏమేర‌కు స‌క్స్‌స్ అవుతుందో... ఇండ‌స్ట్రీలో ఏలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తోందోన‌నేది వేచి చూడాలి మ‌రి..!!!!

tags: sri reddy, keshava rao, k.keshavarao, trs mp, movie, kona venkat, daggubati abhilash,

Related Post