కర్ణాటక గవర్నర్ ప్రధాని మోడీ మాట జవ దాటుతాడా..?

news02 May 15, 2018, 7:26 p.m. political

Karnataka governor

బెంగుళూరు : కర్నాటక ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకపోవటంతో గవర్నర్ పాత్ర కీలకమైంది.  ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేకపోవటంతో రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. 104 సీట్లు వచ్చిన బీజేపీని కాదని 78సీట్లు వచ్చిన కాంగ్రెస్.. 37 సీట్లు వచ్చిన జేడీఎస్ లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు, జేడీఎస్ నేతలు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.

Karnataka governpr

రూల్స్ ప్రకారం మొదటి లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ .. సర్కారు ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.  ఈ లెక్క ప్రకారం ముందు బీజేపీకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. బలనిరూపణకు సమయం ఇస్తారు. ఒక వేళ బీజేపీ బలాన్ని నిరూపించుకోలేకపోతే అప్పుడు రెండో లార్జెస్ట్ పార్టీని రాజ్ భవన్ కు పిలుస్తారు. దీంతో గవర్నర్ పాత్రనే కీలకమైంది.

Pm modi with karnataka governor

కర్నాటక గవర్నర్ పేరు వాజూ భాయ్ వాలా .. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ ల ఎత్తులకు గవర్నర్ సహకరిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గుజరాత్ రాష్ట్రానికి వాజుభాయ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 1999 సమయంలో మోడీకోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ సీటును మోడీకి త్యాగం చేశారు. మోడీకి.. గవర్నర్ కు అత్యంత సన్నిహితుడు    

tags: Karnataka governor, vajubhai vala, modi friend, pm modi, yaddurappa, kara swamy, siddaramaiah, karnataka verdict, karnataka government .

Related Post