క‌న్ఫ్యూజ్ లో ఉన్నారా..? లేక క‌న్ఫ్యూజ్ చేస్తున్నారా.?

news02 May 21, 2019, 11:24 p.m. political

chandrababu_on_ap_assembly_result.,ys jagan,ap

అమ‌రావ‌తి : మేము ప‌క్కా అధికారంలోకి రాబోతున్నాం.. కాదు కాదు మేమే వ‌చ్చేస్తున్నాం.. ఇది ఏపీ ఫ‌లితాల‌పై టిడిపి, వైసీపీల డైలాగ్స్. నో ..డౌట్.. నాదే సీఎం కుర్చీ అని చంద్ర‌బాబు అంటుంటే.. ఇక సీఎం క్యాంప్ ఆఫిస్ ను రెఢీ చేసుకుంటున్నారు జ‌గ‌న్. దీంతో ఇంత‌కు ఏపీలో గెలిచేదెవ‌రు..? టిడిపినా..? లేక.. వైసీపీ నా..? ఇదే ఇప్పుడు అంద‌రిని తెగ క‌న్ఫూజ్ చేస్తుంది. ఆవును.. పార్ల‌మెంట్ ఫ‌లితాల‌ కంటే.. ఏపీ అసెంబ్లీ ఫ‌లితాలే.. ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ గా మారాయి. ఎన్నిక‌ల‌ బ‌రిలో గిరిగీసుకుని పోరాడిని టిడిపి, వైసీపీలు..ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఇదే ఫంథాను కొన‌సాగిస్తున్నాయి. మాదంటే.. మాదే అంధికారం అంటు ఢాంకా బ‌జాయిస్తున్నాయి. ఏపీలో రెండో సారి ప‌వ‌ర్ మాదే అని టిడిపి.. లేదు లేదు.. ఫ్యాన్ గాలి వీచింది.. జ‌గ‌న్ సీఎం అవుత‌న్నారంటూ.. వైసీపీ నేత‌లు కాల‌ర్ ఎగ‌రేస్తుండ‌టం.. ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

ఫ‌లితాలు మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌బోతున్నాయి. అయితే మేజార్టీ ఎగ్టీట్ పోల్స్.. ఏపీలో జ‌గ‌న్ దే హ‌వా అని తేల్చి చెప్పాయి. టూడే చాణ‌క్య సీ ఓట‌ర్ , ఆంద్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం చంద్ర‌బాబు  మ‌ళ్లీ అధికారంలోకి రాబోతున్నార‌ని ప్ర‌క‌టిస్తే.. మిగ‌తా అన్నీ ఎగ్టిట్ పోల్స్..   వైసీపీకి  థంపింగ్ మేజార్టీ వ‌స్తుంద‌ని.. జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పాయి. దీంతో జ‌గ‌న్ ఫ్యాన్స్ ఆల్ మోస్ట్ వేడుక‌ల్లో మునిగి తేలుతున్నారు. అయితే... ఎగ్టిట్ పోల్స్ త‌ర్వాత టిడిపి, వైసీపీ లు వ్య‌వ‌హారిస్తున్న తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లను తెగ అయోమ‌యానికి  గురిచేస్తున్నాయి. పోలింగ్ మ‌రుసటి రోజు నుండి చంద్ర‌బాబు హాడావిడి పెంచుతున్నారు త‌ప్ప త‌గ్గించ‌డంలేదు. యూపీఏ కు మ‌ద్దుతుగా..ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌డుతూ.. ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ పై పిర్యాదుల‌ను కొన‌సాగిస్తున్నారు ఇక ఎగ్టిట్ పోల్స్.. మేజార్టీ జ‌గ‌న్ అంటున్నా... నో డౌట్ .. టిడిపిదే.. అధికారం.. అవ‌స‌ర‌మైతే రాసి పెట్టుకోండి అంటు చంద్ర‌బాబు అంటుంటే.. ఇక తెలుగు త‌మ్ముళ్ళు బాబే సిఎం అంటు.. తొడ‌గొడుతున్నారు.

ys_jagan_and_chandrababu_on_assembly_result

మ‌రోవైపు .. ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత నుండి స్పీడ్ గా ఉన్న వైసీపీ.. ఏకంగా సీఎం క్యాంప్ ఏర్పాట్లు.. కెబినెట్ లో ఎవ‌రుండాల‌న్న‌దానిపై జ‌గ‌న్ బిజీబిజీగా ఉన్నార‌ని వైపీసీ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. ఇప్ప‌డికే హైద్రాబాద్ లోట‌స్ పాండ్ లోని ఫ‌ర్నీచ‌ర్ ను సైతం అమ‌రావ‌తికి త‌ర‌లించారు. అయితే.. ఎగ్టిట్ పోల్స్ త‌ర్వాత..  జ‌గ‌న్ మౌనంగా ఉన్నారు.అయితే ఆ పార్టీ నేత‌లు మాత్రం టిడిపిపై సెటైర్లు విసురుతున్నారు. మొత్తానికి.. చంద్ర‌బాబు, వైసీపీ ల‌ దూకుడుతో..జ‌నం క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. నిన్నటి దాకా జ‌గ‌న్ గెలుస్తార‌ని అన్న‌వాళ్లు.. చంద్ర‌బాబు గెలుస్తార‌ని ధీమాగా చెప్పిన వాళ్ళు సైతం ఇప్ప‌డు స్వ‌రం మార్చుతున్నారు. ఏమో ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు.. చంద్ర‌బాబు, జ‌గ‌న్ లు ఎవ‌రైనా.. గెలువ వ‌చ్చు.. అంటుండ‌టం ఆశ్చ్య‌ర్యం క‌ల్గిస్తుంది. అయితే ఈ రెండు పార్టీలు కావాల‌నే..మైండ్ గేమ్ అడుతున్నాయా..? లేక వాళ్ళే ఆయోమ‌యంలో ఉండి.. జ‌నాన్ని క‌న్ప్యూజ్ చేస్తున్నారా ..? అని తెలియాఅంటే.. మ‌రి కొన్ని గంట‌లు ఆగాల్సిందే.

tags: ys jagan mohan reddy, ap cm chandrababu , ap cm, assembly result, exit polls, become ap cm ys jagan, election commiossion, amaravathi,

Related Post