ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా కాంగ్రెస్ దే అధికారం

news02 April 17, 2018, 7:26 a.m. political

uthamluar reddy illandu meeting

ఇల్లందు ః కేసీఆర్ నాలుగేళ్ళ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ధ్వ‌జ‌మెత్తారు. ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా ఇల్లందులో జ‌రిగిన ప్రజా చైతన్య బస్సు యాత్ర లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భారీగా తరలివచ్చిన జనం, కాంగ్రెస్ కార్యకర్తలతో స‌భా ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. కేసీఆర్ వైఫ‌ల్యాల‌ను ఉత్త‌మ్ ఏక‌రువుపెట్టారు ఉత్త‌మ్‌.ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా కాంగ్రెస్ అధికారంలోకి త‌ప్ప‌క వ‌స్తుందన్నారు ఉత్త‌మ్‌.

congress bus tour

కేసీఆర్ వైఫ‌ల్యాలు చెప్పిన ఉత్త‌మ్‌

* 4 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని ఘనత తెరాస ప్రభుత్వానిదే

* తెలంగాణ రాష్ట్రంలో దళితులను, గిరిజనులను కేసీఆర్ మోసం చేస్తున్నాడు, పోడు, అటవీ భూములను రక్షించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది - ఉత్తమ్
* 35 లక్షల మంది రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదు
* కేసీఆర్ అసమర్థత వల్ల ఉద్యోగాల భర్తీ జాప్యం జరుగుతుంది- ఉత్తమ్
* 2014 జూన్ 2నాటికి 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటే నేటి ఏ ఒక్కటి భర్తీ చేయలేదు
* నేటికి డీఎస్పీ నిర్వహించకపోవటం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు- కేసీఆర్
*  సింగరేణి కార్మికులను మోసం చేసారు కేసీఆర్, ఇల్లేందు లో దళిత అధికారి....రవిబాబు పై దాడి చేసినా...ప్రభుత్వం న్యాయం చేయకపోగా బదిలీ చేసింది
* బీసి లకు abcd ల వారీగా ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు
* బయ్యారంలో ఉక్కు పరిశ్రమపై నాలుగేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు.
* దళితులను అణిచే వేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు, నేరెళ్ల ఘటనలో మాజీ స్పీకర్ మీరాకుమార్ కన్నీరు పెడితే అవహేళన చేశారు కేసీఆర్- ఉత్తమ్
* ఖమ్మంలో రైతులకు సంకెళ్ల వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వనిదే- ఉత్తమ్

congress bus tour

 బీసీలకు ఉత్తమ్ ఎన్నికల హామీలు

*  జనభా ప్రతిపాదికన టికెట్లు, రిజర్వేషన్లు అమలు చేస్తాం
* బీసీ సబ్ ప్లాన్ పేరుతో రిజర్వేషన్లు, నిధులు పెంచుతామని కేసీఆర్ మోసం చేశారు
* బీసీ జనాభా ప్రతిపాదికన రాజ్యాంగ పదవులు ఇస్తాం
* చట్టసభల్లో బీసీలకు సబ్ ప్లాన్ బడ్జెట్ పెట్టాలని సీఎం కేసీఆర్ కోరినా పట్టించుకోలేదు
* బీసీ -ఈ కింద ముస్లింలకు బడ్జెట్ కేటాయింపు చేయాలని కోరాం
* బీసీలకు ఏ సహాయం చేసిన ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం
* రైతులకు ఏకాకాలంలో రూ.2లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం- ఉత్తమ్
* ప్రతీ మహిళా సంఘానికి రూ.10లక్షల రూపాయలు రుణం ఇచ్చి వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది
* కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను సైతం కేసీఆర్ మోసం చేశారు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫర్మినెంట్ చేస్తాం
* ఇల్లేందు నుంచి రైల్వే లైన్ ను పునరుదరిస్తాం

congress illandu bus tour

స్థానిక ఎమ్మెల్యేపై ఉత్త‌మ్ విసుర్లు..


* వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల కష్టం మీద గెలిచి...కేసీఆర్ కు అమ్ముడుపోయారు, స్వార్థం కోసం కనకయ్య అమ్ముడుపోయారు
* ఇల్లేందు, డోర్నకల్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు ద్రోహ చేసారు
* వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడించి పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు గ‌ట్టి బుద్ది చెప్పాలి.

 

Related Post