సుప్రీం కోర్టులో అఫిడవిట్..

news02 June 14, 2018, 8:24 a.m. political

modi

న్యూ డిల్లీ (నేషనల్ డెస్క్)- కేంద్రప్రభుత్వంతో ఇటు తెలంగాణ.. అటు ఆంద్రప్రదేశ్ కు వైరం నడుస్తోంది. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీతో తెగతెంపులు చేసుకుంటే.. తెలంగాణ సీఎం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మోదీ మరో షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. 

babu

ఆంద్రప్రదేశ్ లోని కడపలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసినా అది ఇంకా ముందుకు కదలడం లేదు. ఐతే కడపలో ఉక్కు ఖర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచినా అది తాత్సారం అవుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఏపీ ఆశలపై మోదీ నీళ్లు చల్లారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయని, ముడిసరకు దొరక్క కష్టాలు పడుతున్నాయని పేర్కొంది. ఇక ఇప్పుడు కొత్తగా ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేస్తే అధి నష్టాల కోసమేనని మెకాన్ సంస్థ ఇచ్చిన నివేదికను తమ వాదనకు ఆధారంగా పేర్కొంది. 

babu kcr

మరోవైపు తెలంగాణలో ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఖర్మాగారం ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఐతే దీనిపై కూడా మోదీ నీళ్లు చల్లారు. మెకాన్ సంస్ధ ఇచ్చిన నివేధిక ప్రకారం దేశంలో ఎక్కడా కొత్తగా స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించే అవకాశమే లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఇంకేముంది ఇటు తెలంగాణ.. అటు ఏపీ సర్కార్లకు మోదీ ప్రభత్వం పెద్ద షాక్ ఇచ్చిందని వేరే చెప్పాలా.

tags: babu, kcr, chandra babu, modi, narendra modi, pm modi, modi shokcked, modi shock to babu, modi shock to kcr, modi shock to ap, modi shock to telangana

Related Post