మిషన్ కాకతీయ-భగీరధ ఫెయిల్ అయ్యాయి

news02 June 3, 2019, 6:55 a.m. political

shabbir ali

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఐదు సంవత్సరంలో చేసిన అభివృద్ధి గురించి చెప్తారని భావించామని మాజీ మంత్రి షబ్బీర్ ఆలి అన్నారు. ఈ ఐదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాట్లాడితే పవర్, ఆసరా పెన్షన్ గురించి తప్ప ఇంకోటి మాట్లాడారని షబ్బీర్ ఆలి ఎద్దేవా చేశారు. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఫెయిల్ అయ్యాయని చెప్పిన ఆయన.. ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియేట్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం సంతాపం ప్రకటించలేదని.. చనిపోయిన విద్యార్థి కుటుంబసభ్యులకు కనీసం ధైర్యం ఇవ్వలేదని షబ్బీర్ ఆలి విమర్శించారు. ముస్లిం లకు 12శాతం రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఇస్తామన్నారని.. 40 నెలలు దాటిపోయినా ఆ ఉసే ఎత్తడం లేదని నిలదీశారు. అర్హులందరికి డబల్ బెడ్ రూమ్ ఇస్తామన్న కేసీఆర్.. ఎన్ని ఇళ్లు.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందని.. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని షబ్బీర్ ఆలి అన్నారు. 

tags: shabbir ali, shabbir ali fire on kcr, shabbir ali fire on trs, shabbir ali on loksabha poll results, shabbir rali comments on loksabha poll results, ex minister shabbir ali fire on cm kcr, shabbir ali about muslim reservations

Related Post