పూల బొకే తో జగన్ షాక్

news02 March 4, 2018, 2 p.m. political

Ys jagan praja sankalpa yatra

ఒంగోలు : వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కి ఒక ఆవ్వ షాక్ ఇచ్చింది. ఊహించని పరిణామంతో జగన్ ఒకింత ఇబ్బంది పడ్డారు. ఒంగోలు జిల్లాలోని సంతనూతల పాడు నియోజకవర్గం లో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నాడు. రోడ్డుకిరువైపులా నిలబడి ఉన్న జనానికి జగన్ అభివాదం చేస్తున్నారు. జనం బాగా ఎక్కువగా ఉండటంతో భద్రతా సిబ్బంది వారిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. అంతలోనే ఒక అవ్వ జగన్ తో కరచాలనం చేసేందుకు ఆయన దగ్గరకు వచ్చింది. అయితే జగన్ కు పసుపు కలర్ పూల తో కూడిన కొమ్మను ఇచ్చింది. టిడిపి జెండా గుర్తు అయిన యెల్లో పసుపు కలర్ ను చూడగానే జగన్ షాక్ తిన్నాడు. అయినా మొహం లో బయటికి కనిపించేలా చిన్నగా నవ్వుతూ ఆ పూల కొమ్మను తీసుకున్నాడు. యెల్లో పై జగన్ కు కోపం ఉన్నా అవ్వ ప్రేమగా ఇవ్వడంతో తీసుకోక తప్పలేదు. అవ్వ అభిమానం తో అందుబాటులో ని పూల చెట్టు కొమ్మను జగన్ కు ఇచ్చింది తప్ప ఇందులో రాజకీయం లేదని వైసిపి నేతలు తెలిపారు.

tags: Ys jagan, yellow flowers , ys jagan pada yatra, cm chandrababu, jagan tour, ap special status.

Related Post