సీఎల్పీని విలీనం చేసే హక్కు స్పీకర్ కు లేదు

news02 June 6, 2019, 6:10 p.m. political

uttam

పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా విలీనంపై స్పీకర్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సీఎల్పీని టీాఆర్ ఎస్ లో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేశారు. సీఎల్పీని టీఆర్ ఎస్ లో  విలీనం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన  12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్  పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలిశారు. దీన్ని నిరసిస్తూ నోటికి  నల్లరిబ్బన్‌ కట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నల్డొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,  ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి , పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ ,తదితరులు గాంధీ విగ్రహం ఎదుట నేలపై కూర్చొని నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై  గెలుపొంది.. సీఎల్పీని టీఆర్ ఎస్ లో విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్ ఎస్ నేతలను కలిసినట్టు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లను గతంలో స్పీకర్‌కు ఇచ్చినా అనర్హత వేటుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 

uttam

టీఆర్ ఎస్ లో సీఎల్పీ విలీనం ప్రక్రియ వ్యవహారంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను స్వయంగా స్పీకర్‌కు ఫోన్‌ చేస్తే ఆయన అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది చెప్పారని, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము కలిసేందుకు స్పీకర్ సమయం ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ నిలదీశారు. సీఎల్పీని టీఆర్ ఎస్ లో విలీనం చేసే హక్కు స్పీకర్ కు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను టీఆర్ ఎస్ లో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ వైఖరిని తప్పుబడుతూ అసెంబ్లీ ఆవరణలో నిరసన చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

uttam

tags: congress, congress mlas protest at assemblt, uttam kumar reddy protest at assemblt, uttam and mlas protest at assemblt, uttam fire on speaker, pcc chief uttam fire on assembly speaker, pcc chief uttam protest at assembly

Related Post