ఎమ్మెల్యే.. ఎంపీ చస్తేగాని స్పందించరా..

news02 Sept. 12, 2018, 4:21 p.m. political

ktr

హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామని మన పాలకులు గొప్పలు చెబుతారు. ఇక మన మునిసిపల్ మంత్రి గా పనిచేసి కేటీఆర్ ఐతే హైదరాబాద్ గురించి చెప్పని మాటలు లేవు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కడ చిన్న గుంత చూపించినా వారికి బహుమతి ఇస్తానని చాలెంజ్ సైతం చేశారు కేటీఆర్. కానీ అవన్నీ కేవలం మాటలవరకే ననియయ చేతల్లో మాత్రం శూన్యమని చాలా సందర్బాల్లో రుజువైందనుకొండి. హైదరాబాద్ లో రోడ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో నగరవాసులకు బాగా తెలుసు. అసలే పాడైన రోడ్లంటే.. ఇక వర్షాకాలమైతే చెప్పనక్కర్లేదు.. అడుగు తీసి అడుగు వేయాలంటే హైదరాబాద్ వాసులకు నరకమే.

ktr

ఇన్నాళ్లు ఒపిక పట్టిన హైదరాబాద్ వాసులు ఇప్పుడు తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మణికొండ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి కేటీఆర్ పై మండిపడ్డాడు. తాను నగరంలోని రోడ్ల అధ్వాన్న స్థితి వల్ల ప్రమాదానికి గురయ్యానని ఆవేధన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ లో రోడ్లు దారుణంగా ఉన్నాయని.. తాము ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నప్పుడు రోడ్లను ఎందుకు బాగు చెయ్యరని అతను కేటీఆర్ ను ప్రశ్నించాడు. ఓ ఎమ్మెల్యేనో.. ఎంపీనో ఈ చెత్త రోడ్లపై పడి చనిపోతే గాని మీరు రోడ్లు బాగు చేయించరా అని సాప్ట్ వేర్ ఉద్యోగి ట్విట్టర్ లో కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించాడు. మరి ఈ సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రశ్నకు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.. 

 

tags: ktr, software employee fire on ktr, software fire on ktr, software employee fire on hyd raods, software employee about ktr

Related Post