కేసీఆర్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

news02 Dec. 12, 2018, 8:30 p.m. political

babu

ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ పడిన చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞాన భేరిలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. 

babu

దివంగత ఎన్టీఆర్‌ టీడీపీ పార్టీని తెలుగుజాతి కోసం పెట్టారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి... కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి కోసం పనిచేశానని స్పష్టం చేశారు. ఇక ప్రపంచంలో ఎవరైనా తాజ్‌ మహల్‌ తర్వాత ఏపీ అసెంబ్లీ గురించే మాట్లాడే పరిస్థితి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచం మొత్తం అబ్బురపడేలా రాజధాని నిర్మాణం చేపడతామని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, ప్రతిఒక్కరూ దూరదృష్టితో ఆలోచించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. 

tags: babu, cm chandra babu, babu on kcr, chandra babu about kcr gift, chandra babu comments on kcr gift, babu about cm kcr gift

Related Post